మత్స్యకార సోదరులకు శుభాకాంక్షలు: చంద్రబాబు

ba

ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా.. మత్స్యకార సోదరులందరికి శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. తమ హయంలో మత్స్యరంగంలో ఏపీని దేశంలోనే అగ్రామిగా నిలిపామన్నారు. మత్స్యరంగ అభివృద్ధితోపాటు మత్స్యకారులలో పేదరిక నిర్మూలనకు సైతం ఎంతో కృషి చేశామంటూ ట్వీట్‌ చేశారు చంద్రబాబు. 50 ఏళ్లకే పించన్లు ఇచ్చి వారిలో భరోసా పెంచామన్నారు.

వేట నిషేధ కాలంలో పరిహారం రెండు రెట్లు చేశామని గుర్తు చేశారు చంద్రబాబు. మహిళా మత్స్యగ్రూపులకు సహయం 4 రెట్లు చేశామని, వేటకెళ్లి తిరిగిరాని మత్స్యకారుల కుటుంబాలకు పరిహారం రెండు రెట్లు చేశామన్నారు. మత్స్యకారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు సైతం నిర్మించామన్నారు. మత్స్యకారులకు అండగా ఆదరణ పథకాన్ని తెచ్చామని.. అందుకే వారు టీడీపీకి వెన్నుముకగా నిలిచారన్నారు చంద్రబాబు.

TV5 News

Next Post

పోలవరం ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ

Thu Nov 21 , 2019
మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ పోలవరం ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభించింది. స్పిల్‌వే ప్రాంతంలో కాంక్రీట్‌ పనుల్ని ప్రారంభించింది. తొలిరోజు వంద క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేసింది. వాస్తవానికి రోజుకు 2 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనుల్ని చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది మేఘా సంస్థ. ఇక రాక్‌ఫిల్‌ డ్యాంలో కోటిన్నర క్యూబిక్‌ మీటర్లు పనులు చేయాల్సి ఉంది. అటు ఎర్త్‌కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యాం, ఇటు కాపర్‌ డ్యాం పనులను […]