వైసీపీ నేతల అరాచకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి – చంద్రబాబు

రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచకాలు విపరీతంగా పెరిగిపోయాయని టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో సమావేశమైన బాబు.. పార్టీ నేతలపై జరుగుతున్న దాడులపై చర్చించారు. ఈ విషయంలో ధైర్యంగా ముందడుగు వేస్తున్న నాయకులను, కార్యకర్తలను అభినందించారు. ఎంపీడీవో సరళ ఉదంతాన్ని ప్రస్తావించిన చంద్రబాబు.. రాష్ట్రంలో జరుగుతున్న దాడులన్నింటికీ సీఎం జగన్‌ సమాధానం చెప్పి తీరాలని డిమాండ్‌ చేశారు.

TV5 News

Next Post

వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

Wed Oct 9 , 2019
నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కల్వకుర్తి మండలంలోని రఘుపతి పేట దుందుభి వాగులోకి ప్రైవేటు ఆర్టీసీ బస్సు అదుపు తప్పి దూసుకెళ్లింది. వెంటనే స్పందించిన కొందరు ప్రయాణికులు బస్సులో నుంచి దిగేశారు. అయితే అంతలోనే బస్సు ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. అప్పటికి బస్సులో ఇంకొంత మంది ప్రయాణికులున్నారు. అయితే మిగతా ప్రయాణికులు.. స్థానికులతో కలిసి వారిని సురక్షితంగా బయటకు దించారు. అనుభవం లేని డ్రైవర్‌.. […]