చంద్రబాబు ఇంటిని తాళ్లతో కట్టేసిన పోలీసులు

చంద్రబాబు నాయుడి నివాసంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి ఉదయం 8గంటలకే బయలుదేరాల్సి ఉన్నా.. పోలీసులు గృహనిర్బంధం కారణంగా ఇంటికే పరిమితం అయ్యారు. బాధితులకు అండగా ఇంట్లోనే చంద్రబాబు దీక్షకు దిగారు. అయితే నేతల అరెస్టులు, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు 11 గంటల సమయంలో భారీగా చేరుకున్న కార్యకర్తలు మధ్య ఆత్మకూరుకు బయలుదేరారు. అయితే గేటు ముందున్న పోలీసులు చంద్రబాబు కారును బయటకు రాకుండా గేటు మూసివేశారు. పెద్ద తాళ్లతో గేట్లు లాక్‌ చేశారు. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.

ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబును అడ్డుకోవడంపై నేతలు మండిపడుతున్నారు. ప్రతిపక్ష నేత ఇంటిని తాళ్లతో కట్టడం దుర్మార్గమన్నారు. పోలీసుల తీరును టీడీపీ నాయకులు తప్పుబట్టారు. గతంలో ఏ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదన్నారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులు చిన్నరాజప్ప, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావ్‌ ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

పెళ్ళి చేసుకుంటున్నారా? అయితే..

Wed Sep 11 , 2019
ఉన్నది ఒక్కటే జీవితం. ఏం సాధించినా అందులోనే. ఆ జీవితాన్ని అర్ధాంతరంగా కాలదన్నుకుంటే? అక్కడితోనే మన కథ పరిసమాప్తమవుతుంది! చాలా మంది ఊహల్లో బతుకుతారు. భవిష్యత్ అలానే ఉంటుంది అనుకుంటారు. ముఖ్యంగా పెళ్ళి చేసుకునే యువతీ యువకులు ఆలోచనలు వాస్తవానికి దూరంగా ఉంటున్నాయి. వారు వాస్తవిక ప్రపంచానికి దూరంగా బతుకుతున్నారు. వివాహ బంధాన్ని మధ్యలోనే కాలదన్నుకుంటున్నారు. కొత్త మురిపెం కొన్నాళ్ళే అన్నట్టుగా.. పెళ్లైన కొత్తలో ఒకరికొకరి మధ్య అన్యోన్యత ఉన్నా […]