జైట్లీ పార్థివ దేహానికి చంద్రబాబు నివాళి

అనారోగ్యంతో కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ భౌతికకాయానికి ప్రముఖులు ని బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరింది. అభిమానులు, కార్యకర్తల సందర్శన కోసం మధ్యహ్నం రెండు గంటల వరకు ఆయన పార్థీవ దేహాన్ని ఉంచుతారు. తరువాత నిగమ్‌ బోధ్‌ శ్మసానవాటికలో అంతిమ సంస్కారాలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తారు. బీజేపీతో సహా, వివిధ పార్టీ నేతలకు తోడు, క్రికెటర్లు, వ్యాపార దిగ్గజాలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు అంతా జైట్లీకి నివాళులర్పిస్తున్నారు.

అరుణ్‌ జైట్లీ పార్థీవ దేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఉదయం కైలాష్‌ నగర్‌లో జైట్లీ నివాసానికి వెళ్లి.. ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తనకు జైట్లీతో ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.. దేశం ఒక గొప్ప మేధావిని కోల్పోయిందన్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

రోడ్డుపైకి మొసలి.. దానిపై నుంచి వాహనం వెళ్లడంతో..

Sun Aug 25 , 2019
సూర్యాపేట జిల్లా పులిచింతల ప్రాజెక్ట్‌ నుంచి వజినేపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డులో ఓ మొసలి మృత్యువాత పడింది. గుర్తు తెలియని వాహనం మొసలిపై నుంచి వెళ్లడంతో మృతిచెందింది. పులిచింత ప్రాజెక్టులో రెండు రోజుల క్రితం డ్యామ్‌ క్రస్ట్‌గేట్లు, కరకట్ట సమీపంలో ఐదు మొసళ్లు దర్శనమిచ్చాయి. దీంతో జాలర్లు హడలెత్తిపోయారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులోకి చేపలు పట్టడానికి ఎవరూ వెళ్లరాదంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు తెల్లవారు జామున వాటిలో […]