ఆ పేరుతో తెలంగాణకు కరెంట్ ఇవ్వాలని చూస్తున్నారు : చంద్రబాబు

సీఎం జగన్ కు తెలంగాణపై ఉన్న ప్రేమ ఏపీ మీద లేదని ఆరోపించారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. పీపీఏలకు సంబంధించి గత ప్రభుత్వంపై జగన్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారాయన. పీపీఏలపై సమీక్ష పేరుతో తెలంగాణకు కరెంట్ ఇవ్వాలని చూస్తున్నారని అన్నారు. వైసీపీ చెప్పిన రేట్లకు టీడీపీ ప్రభుత్వం ఎక్కడా విద్యుత్ కొనుగోలు చేయలేదని ఆరోపణలను కొట్టిపారేశారు. పీపీఏల విషయంలో ప్రభుత్వ పాత్ర నామమాత్రం అని గుర్తు చేశారు.

పీపీఏలపై విమర్శలు చేస్తున్న జగన్..తమ పవర్ ప్లాంట్ నుంచి కర్ణాటకకు ఎందుకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ప్రశ్నించారు చంద్రబాబు. రెండు పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ ఎక్కువ ధరకు అమ్ముకుంటూ ఏపీలో మాత్రం యూనిట్ ధరలపై గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

మద్యం ఆపై గన్స్‌తో డ్యాన్స్‌ : ఎమ్మెల్యేపై వేటు

Wed Jul 17 , 2019
ఒక చేతిలో గన్, మరో చేతిలో మందు గ్లాసు పట్టుకొని చిందులు వేసిన ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ పై వేటు పడింది. ఏకంగా 6ఏళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించారు. ప్రణవ్ చిందులేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న బీజేపీ ప్రణవ్ సింగ్ ను పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరిస్తూ […]