వైసీపీ పాలన వైఎస్‌ పాలనను తలపిస్తోంది : చంద్రబాబు

కరెంటు గురించి మాట్లాడదాం అనుకుంటే… ఇంతలో కరెంట్‌ పోయిందన్నారు చంద్రబాబు. విశాఖలో పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తుండగా విద్యుత్‌ పోవడంతో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో కరెంటు కోతల్లేవన్నారు. రాష్ట్రంలో మళ్లీ చీకటి రోజులొచ్చాయన్నారు బాబు. అప్పడు వైఎస్‌ టైమ్‌లో కోతలుండేవని, ఇప్పుడు వైసీపీ పాలన వైఎస్‌ పాలనను తలపిస్తోందన్నారు. జగన్‌కి తండ్రి వారసత్వం వచ్చిందని ఎద్దేవా చేశారు చంద్రబాబు.

TV5 News

Next Post

ఓవర్ యాక్షన్ చేస్తున్న పోలీసులకు ఇబ్బందులు తప్పవు : చంద్రబాబు హెచ్చరిక

Thu Oct 10 , 2019
టీడీపీ కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. విశాఖ టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో బాబు భేటీ అయ్యారు. జిల్లా నేతలతో నియోజకవర్గాల వారిగా చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాస్‌, అయ్యన్న పాత్రుడు ఇతర నేతలు పాల్గొన్నారు. ఓవర్ యాక్షన్ చేస్తున్న పోలీసులకు ఇబ్బందులు తప్పవని బాబు హెచ్చరించారు.