అఖిలప్రియను అణగదొక్కడానికే ఆ కేసులు : చంద్రబాబు

Read Time:0 Second

వైసీపీ ప్రజా ప్రతినిధులు ఇష్టం వచ్చినట్టు వ్యవహిస్తే చూస్తూ ఊరుకోబమని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ప్రభుత్వం చేసే తప్పులను ప్రజల్లో ఎండగతామన్నారు. నెల్లూరు నాయకులను పిలిచి సీఎం జగన్‌ పులివెందుల పంచాయతీ చేస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబు. ఏపీలో జగన్‌ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.

వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డికి రెండు గంటల్లో బెయిల్‌ ఇచ్చి ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని చంద్రబాబు నిలదీశారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు బరి తెగించి ప్రవర్తిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేయడానకి ఎంపీడీవో సరళ 8 గంటల పాటు ధర్నా చేయాల్సిన పరిస్థితి నెలకొందని గుర్తు చేశారు.

నేటి నుంచి సీఎం జగన్‌ ప్రారంభిస్తున్న కంటి వెలుగు పథకంపైనాన విమర్శలు చేశారు. కంటి వెలుగు అనేది మరో జగన్మాయ అని చంద్రబాబు అన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో పథకాన్ని పేరు మార్చి ప్రజలను ఏమారుస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో 13 జిల్లాలలో 222 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు పెట్టి 67లక్షల మందికి ఉచిత చికిత్స జరిపామని గుర్తు చేశారు. 3లక్షల మందికి కళ్లజోళ్లు ఉచితంగా ఇచ్చామన్నారు.

ఆటోలకు పోలీసులు, రవాణా శాఖ సిబ్బంది పోటిపడి జగన్ స్టిక్కర్లు అతికించడం నవ్వుల పాలైందన్నారు. అటు ఆళ్లగడ్డలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న భూమా అఖిలప్రియను అణగదొక్కడానికే ఆమె భర్త భార్గవ రామ్ పై తప్పుడు కేసులు పెట్టారు. జగన్ ట్యాక్స్ విధించి మద్యం ధరలు పెంచేశారు. చివరికి తాగుబోతులను కూడా వదలకుండా జలగల్లా పీలుస్తున్నారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయ నియామకాలన్నీ పెద్ద గోల్ మాల్ గా తయారైందని చంద్రబాబు ఆరోపించారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close