మంత్రి బొత్సకు చింతమనేని సవాల్

పశ్చిమగోదావరి జిల్లా పోలీసుల తీరుపై చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పోలీసులు అరెస్ట్‌ చేయలేదని.. తానే స్వచ్ఛందంగా వచ్చాను అన్నారు. వైసీపీ నేతల దగ్గర ఎంత దమ్ము ఉంటే అంత చూపించాలని.. మంత్రి బొత్స వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. తాను తప్పు చేశానని బొత్స నిరూపిస్తే.. తన ఆస్తులు మొత్తం పేద ప్రజలకు రాసిస్తానన్నారు. గ్రామసభ పెట్టి.. ఆ ఊర్లో ప్రజలు తాను తప్పు చేశానని చెప్తే చాలు దేనికైనా సిద్ధంగా ఉంటాను అన్నారు. విజయసాయి రెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డిలు తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ విచారణకు సిద్ధంగా ఉన్నానని.. వైసీపీ నేతలు వచ్చి నిరూపిస్తారా అని ప్రశ్నించారు.

Also watch :

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ఏం నాయనా ఇద్దరు పెళ్లాలు చాల్లేదా.. మూడో సారీ..

Wed Sep 11 , 2019
ఒక్క భార్యతో కూడా సక్కగ సంసారం చేయడాయే. ఒకటి కాదు రెండు కాదు మూడు పెళ్లిళ్లు కావాలట. ముందు చేసుకున్న ఇద్దర్ని వదిలేశాడు. మూడో భార్యకి మూడు ముళ్లు వేయడానికి రెడీ అయ్యాడు. ఉతికి ఆరేస్తే దారికొస్తాడంటూ ఇద్దరు భార్యలు కలిసి అతడు పని చేసే ఆఫీస్‌కి వెళ్లి ఈడ్చి కొట్టారు. కోయంబత్తూరు జిల్లా సూలూరు సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. నెహ్రూనగర్‌కు చెందిన సౌందర […]