వైసీపీ సర్కార్‌కు చింతమనేని ప్రభాకర్‌ సవాల్

chintamaneni

తాను నిజంగా తప్పు చేశానని ప్రజలు భావిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నారు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. తనను రాజకీయంగా భూస్థాపితం చేయడానికి 13 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జైలు నుండి విడుదల అయిన ఆయన.. నేరుగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కావాలనే సెక్షన్ 30 పెట్టి పోలీసులు ఉద్యోగ ధర్మాన్ని తప్పుతున్నారని విమర్శించారు. పోలీసుల సహాయంతో ప్రతిపక్ష నాయకులను అణచివేస్తున్నారని చింతమనేని ఆరోపించారు. తనపై అక్రమ కేసులు పెడితే.. అండగా ఉన్న పార్టీ పెద్దలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

TV5 News

Next Post

టీమిండియా ఖాతాలో మరో అరుదైన రికార్డు

Sun Nov 17 , 2019
బ్యాట్స్‌మెన్‌ రఫ్పాడించారు.. బౌలర్లు విజృంభించారు.. దీంతో తొలి టెస్టు మూడ్రోజుల్లోనే ముగిసింది. మరో రికార్డు విజయం టీమిండియా ఖాతాలో పడింది. భారత్‌ దెబ్బకు బంగ్లాదేశ్‌ ఎక్కడా నిలబడలేకపోయింది. అటు ఈ విజయంతో టెస్ట్‌ చాంపియన్‌షిప్‌లో ఎవరికీ అందనంత ఎత్తులో భారత్‌ నిలిచింది. ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌ని ముచ్చటగా మూడ్రోజుల్లోనే ముగించేసింది కోహ్లీ సేన.. భారత బౌలర్లు విజృంభణతో తొలిటెస్టులో బంగ్లాదేశ్ పై ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఘన […]