నా బయోపిక్‌లో హీరో..

టాలీవుడ్‌, బాలీవుడ్‌లలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. వాస్తవాలకు కాస్త నాటకీయత జోడించి తెరకెక్కుతున్న బయోపిక్‌లను ఛాలెంజింగ్‌గా తీసుకుని నటీ నటులు తమ పాత్రలకు వంద శాతం న్యాయం చేస్తున్నారు. చాలా వరకు సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు అదే కోవలో చిరంజీవి బయోపిక్ టాపిక్ కూడా తెరపైకి వచ్చింది. సైరా సక్సెస్ మీట్‌లో చిరంజీవి దీని గురించి మాట్లాడడంతో ఈ ఆలోచన త్వరలోనే రూపుదాల్చనుందేమోననే అనుమానాలకు ఊతమిచ్చేదిగా ఉంది. రామ్ చరణ్ అయితే తన పాత్రకు న్యాయం చేస్తాడనే నమ్మకం ఉందని చిరంజీవి ఈ సందర్భంగా అన్నారు. కానీ సమస్యలున్నాయి అందుకే చరణ్ కంటే వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లలో ఎవరో ఒకరు హీరోగా నటిస్తే బాగుంటుందని చెప్పారు. ఈ ముగ్గురిలోనా పోలికలు ఎక్కువగా ఉన్నాయని సన్నిహితులు చెబుతుంటారు. అందుకే వీరిలో ఎవరు నటించినా ఓకే అని తన మనసులో మాటను వ్యక్తం చేశారు. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వారైతేనే ఆ పాత్రకు న్యాయం జరుగుతుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. మొత్తానికి చిరంజీవి తన బయోపిక్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే తెలుస్తోంది.

TV5 News

Next Post

బండ్ల గణేష్‌, పీవీపీ మధ్య వార్.. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

Sat Oct 5 , 2019
బండ్ల గణేష్‌, పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ) మధ్య ఆర్థిక వివాదం నెలకొంది. పోలీస్‌ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. బండ్ల గణేష్‌ తనకు 7 కోట్లు ఇవ్వాలని అడిగితే.. బెదిరింపులకు దిగుతున్నాడని పీవీపీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బండ్ల గణేష్‌, అతని అనుచరులు శనివారం అర్థరాత్రి తన ఇంటికి వచ్చి.. హల్‌చల్‌ చేశారని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. దీంతో బండ్ల గణేష్‌, అతని అనుచరులపై 448, 506, 420 […]