పంద్రాగస్టు వేళ చికెన్ అమ్మకాలపై ఘర్షణ

పంద్రాగస్టు వేళ చికెన్ అమ్మకాలు చిత్తూరు జిల్లాలో ఘర్షణకు దారి తీశాయి. ఆగస్టు 15న మాసం అమ్మకూడదని నిబంధనలు ఉన్నా.. వి.కోట మార్కెట్‌లో ఓ వ్యక్తి షాప్ తెరవడం వివాదాస్పదమైంది. కొందరు వ్యక్తులు దాన్ని వీడియో తీసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో షాప్ నడుపుతున్న జిలానీని పోలీసులు విచారణకు పిలిచారు. ఇది తెలిసి ఆగ్రహానికి గురైన జిలానీ స్నేహితులు పీఎస్‌కి వచ్చి హంగామా చేశారు. కంప్లైంట్ చేసిన ముగ్గురిపై దాడి చేశారు. ఇదంతా పోలీసుల కళ్లముందే జరుగుతున్నా.. కనీసం వారిని ఆపే ప్రయత్నం చేయలేదని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Watch :

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

భారీగా గంజాయి పట్టివేత.. లారీ, కారు సీజ్‌

Fri Aug 16 , 2019
కర్నూలు జిల్లాలో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. గూడురు మండలం నాగలపురం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా మినీ లారీలో 500 కిలోల గంజాయిని గుర్తించారు. మినీ లారీ, మరో కారును సీజ్‌ చేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దందా వెనుక అంతర్‌రాష్ట్ర గంజాయి ముఠా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. Also Watch :