కూతురితో సన్నిహితంగా ఉన్నాడని యువకుడిపై పెట్రోల్ పోసి..

Read Time:0 Second

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. తమ కూతురితో సన్నిహితంగా ఉన్నాడన్న కోపంతో.. లోకేష్‌ అనే యువకుడిని పెట్రోల్‌ పోసి తగులబెట్టారు యువతి తల్లిదండ్రులు. మదనపల్లె రూరల్‌ మండలం టేకుపల్లిలో ఈ ఘటన జరిగింది. పెట్రోల్‌ పోసి తగులబెట్టినా చనిపోకపోవడంతో… కరెంట్‌ షాక్‌ ఇచ్చి హత్య చేశారు. తర్వాత నిందితులు పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు, డాగ్ స్క్వాడ్‌ సాయంతో అమ్మాయి కుటుంబ సభ్యులు ముగ్గురిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.

ఐతే.. హత్యకు గురైన లోకేష్‌పై గతంలో కొన్ని కేసులున్నాయని గుర్తించారు.. అత్యాచారం కేసులో జైలుకి కూడా వెళ్లి వచ్చాడు. వివాదాస్పద వ్యక్తిగా ఈ కుర్రాడికి పేరుంది. ఈ హత్యకు మాత్రం యువతితో ఉన్న సంబంధమే కారణంగా తెలుస్తోంది.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published.

Close