సాహో రివ్యూ

సాహో రివ్యూ

టైటిల్‌ : సాహో

నటీనటులు : ప్రభాస్, శ్రద్ధ కపూర్‌, వెన్నెల కిషోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు

సంగీతం : తనిష్క్‌ బగ్చీ, గురు రాంద్వా, బాద్‌షా, జిబ్రాన్‌ (నేపథ్యం)

నిర్మాత : వంశీ, ప్రమోద్

దర్శకత్వం : సుజీత్‌

విడుదల తేదీ: 30-08-2019

బాహుబలితో ఇండియన్ స్ర్కీన్ మీద తనదైన ముద్రను వేసుకున్న ప్రభాస్ ‘సాహో’ తో ఆ రేంజ్ ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసాడు. ప్రీ రిలీజ్ టాక్, సాహో ట్రైలర్, కూడా ఆ అంచానాలను పెంచాయి. మరి సాహో తో ప్రభాస్ ఎలాంటి ప్రభావం చూపాడో చూద్దాం..

కథ:

అశోక్ (ప్రభాస్), అమృతనాయర్(శ్రద్ధ కపూర్‌) ఇద్దరూ ముంబై క్రైం బ్రాంచ్ లో పనిచేస్తుంటారు. ఒక భారీ దొంగతనం పై వారు చేసే రీసెర్చ్ లో కథ ఒక బ్లాక్ బాక్స్ దగ్గర ఆగుతుంది. దుబాయ్ లోని వాజీ సిటీలో ఉండే గ్యాంగ్ స్టర్స్ ఆదితప్యం కోసం చేసే పోరాటం లో రాయ్ అనే గ్యాంగ్ స్టర్ చనిపోతాడు. అతని దగ్గర ఉన్న మొత్తం కూడా బయటకు రావాలంటే ఈ బ్లాక్ బాక్స్ తోనే సాధ్యం అవుతుంది. అశోక్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన రీసెర్చ్ మొత్తం ఒక దశలో ఆ బ్లాక్ బాక్స్ కోసం అని అర్దం అవుతుంది. మరి ఈఅశోక్ ఎవరు..? బ్లక్ బాక్స్ కి అతనికి సంబంధం ఏంటి..?

అనేది మిగిలిన కథ..?

కథనం:

బాహుబలి తర్వాత పెరిగిన ఇమేజ్ ని మ్యాచ్ చేసే కథ దొరకాలంటే అది అంత సులభమైన పని కాదు. కథను మ్యాచ్ చేయకపోయినా బడ్జెట్ ని మ్యాచ్ చేసేందుకు నిర్మాతలు కృషి చేశారు. అందుకే సాహో భారీగా తయారయ్యింది. కథ గా కంటే కథనం బలంతో సాగే సినిమా సాహో. ఈ కథలో లో క్యారెక్టర్స్ మద్య సర్ ప్రైజ్ లు, అనుకోని మలుపులు బలంగా మారతాయి. మరి సాహో లో అలాంటి కథనం, ట్విస్ట్ లు ఉన్నా, కథనంలో వేగం తగ్గింది అనడంలో సందేహం లేదు. హీరో క్యారెక్టరైజేషన్ ని బాగా డిజైన్ చేసుకోవాల్సిన అవసరం కనిపించింది. సాహో లో ప్రభాస్ లుక్స్ కూడా చాలా వేరియేషన్స్ కనపడతాయి. ఇవి ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే అంశాలుగానే చూడాలి. అయితే అమృత నాయర్ పాత్రలో శ్రర్ధ నటన ఆకట్టుకుంది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఒంటరి తనంతో బాధ పడే అమ్మాయిగా శ్రద్ధ నటన చాలా బాగుంది. ఇక హీరో, హీరోయిన్ల మద్య లవ్ ఎస్టాబ్లిష్ అయ్యే సన్నివేశాలు బాగున్నాయి. అయితే కథ , కథనాలు వెళ్ళే దారిలోనే ప్రేక్షకులకు కావాల్సినంత కన్ ప్యూజన్ పెట్టాడు దర్శకుడు. జరుగుతున్న సన్నివేశాలు ఆసక్తిని కలిగించకపోగా విసుగును తెప్పించాయి. దీంతో సాహో తో ప్రయాణం చాలా నీరసంగా సాగింది. ఇక ప్రభాస్ పాత్ర లోని ట్విస్ట్ అర్దం అయ్యాక, కథనం లో వేగం కాస్త పెరిగింది. ఒక పెద్ద విలన్ గ్యాంగ్ ని ఎదుర్కునే హీరోకి అడుగడుగునా పోరాటాలు, ఎత్తుకు పై ఎత్తులతో సినిమా సాగుతుంది. అయితే ఆ పోరాటాల వెనక ఉన్న బలమైన పాయింట్ ని కనెక్ట్ చేయలేకపోవడంతో అవి అప్పటికప్పుడు ఆనంద పెట్టినా తర్వాత గుర్తుకు రావు. ఒక విలన్స్ సామ్రాజ్యాన్ని కూల్చడానికి ఒకడు ఒంటరిగా చేసే పోరాటంలో అతనకి ఎదురైన వ్యక్తులను ఎదుర్కుంటూ సాహో చేసే యుద్దం దారి తప్పింది. భారీ ఛేజ్ లు, భారీ గా కనిపించే బిల్డింగ్ ల మద్య పోరాటాలు, సాహో నిర్మాణ విలువలు గుర్తుకు తెస్తాయి. అయినా సాహో లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. బలమైన కథా, కథాలను తోడుంటే సాహో ఆశించిన స్థాయి విజయం అందుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ గందరగోళంగా అనిపించే కథనాలు సాహో కు ప్రతి బంధకాలుగా తయారయ్యాయి. బాహుబలి తర్వాత సాహో తో ప్రభాస్ అంచనాలను అందుకోలేకపోయాడు.

చివరిగా:

యాక్షన్ కోసమే సాహో..

-కుమార్ శ్రీరామనేని

Tags

Read MoreRead Less
Next Story