నేను లేను మూవీ రివ్యూ

కొత్తదనం నిండిన సినిమాలు ఇప్పుడు టాలీవుడ్ లో సక్సెస్ ట్రాక్ పై పరుగులు పెడుతున్నాయి. కంచెరపాలెం నుండి ఎజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ వరకూ చాలా ఉదాహారణలు రీసెంట్ గా కనిపిస్తున్నాయి. పోస్టర్ వాల్యూ తో కాకుండా కంటెంట్ వాల్యూతో నిండిన సినిమాల మద్య లో ‘నేను లేను ’ అనే టైటిల్ ఆసక్తికరంగా అనిపించింది. మరి ఆసక్తిని సినిమా ఎంత వరకూ నిలబెట్టుకుంది… అనేది ఇప్పుడు చూద్దాం..

కథ:
ఈశ్వర్ (హార్షిత్ ) కర్నూల్ లో వీడియో ప్రొడక్షన్స్ హౌస్ రన్ చేస్తుంటాడు. అతనికి పార్వతి(శ్రీపద్మ) ని చూడగానే ఇష్టపడతాడు. ఆ ఇష్టం ఇద్దరి మద్య ప్రేమగా మారుతుంది. ఒక సారి ఈశ్వర్ తనను తరుముకొస్తున్న కొందరి నుండా కాపాడుకునే ప్రయత్నంలో ముగ్గురిని హాత్య చేస్తాడు. ఆ హాత్యను ఇన్వెస్టిగేట్ చేసే సమయంలో పోలీసులకు కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి. ఈశ్వర్ తనను ఎవరో చంపేసారు అనే మానసిక స్థితికి వస్తాడు . ప్రేమించిన పార్వతిని గుర్తు పట్టలేనంతగా డిస్ట్రర్బ్ అవుతాడు. మరి ఆరోజు ఏం జరిగింది..? ఈశ్వర్ తన ప్రేమను తిరిగిపోందుతాడా..? అనేది మిగిలిన కథ..?

కథనం:
సైకలాజికల్ థ్రిల్లర్ గా మొదలయిన ఈ కథలోని ట్విస్ట్ లు ప్రేక్షకులను ఉత్కంఠతకు గురిచేస్తాయి. దర్శకుడు రామ్ కుమార్ కొత్తదనం నిండిన కథనం తో సినిమాను ఆద్యతం ఆసక్తిగా మలిచాడు. హీరో,హీరోయిన్లు కొత్త వారైనా తమ పాత్రలకు న్యాయం చేసారు. సీరియస్ గా మొదలైన కథలో వారి ప్రేమకథ అల్లరితో సరదగా సాగుతుంది. యూత్ ని ఆకట్టుకునే రోమాంటిక్ మాటలు, సన్నివేశాలతో ప్రేమకథను నడిపాడు. హీరోయిన్ గా నటించన శ్రీపద్మ క్యారెక్టర్ ని బాగా డిజైన్ చేసాడు దర్శకుడు. యూత్ ని ఎట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ తో నిండిన ఆ పాత్రలోని చిలిపిదనం ప్రేక్షకులకు రిలీఫ్ గా మారుతుంది. ఇక హీరోగా చేసిన హార్షిత్ ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకునే నటన కనబరిచాడు. సినిమా కథను ఎవరూ ఊహించని విధంగా నడపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఒక మనిషి తను చనిపోయాడు అని చెప్పడం వంటి షాకింగ్ సన్నివేశాలను డిజైన్ చేసి కథనం నడిపాడు. ఈ సినిమా కథ థ్రిల్లర్ రా లేక హార్రర్ ఎలిమెంట్స్ ఏమైనా దాగి ఉన్నాయా అనే ఆలోచన లో పడవేశాడు దర్శకుడు . అలాంటి ట్విస్ట్ లతో కథనం బిగుతుగా సాగుతుంద. నేను లేను అనే టైటిల్ కి దర్శకుడు చేసిన జస్టిఫికేషన్ బాగుంది. ఒక కథను ఇంట్రెస్ట్ గా నడపడంలో దర్శకుడికి సినిమాటాగ్రాఫర్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అండగా నిలిచాయి. ఇటువంటి సినిమాలకు తలెత్తే బడ్జెట్ సమస్యలేమీ ఈ కథను తక్కువగా చూపలేదు. ఆర్టిస్ట్ లను ఎక్కవు ఎలివేషన్స్ జోలికి వెళ్ళకుండా కథలోని సన్నివేశాలతోనే వారిని ఎలివేట్ చేసాడు. అందుకే కంప్లీట్ సినిమాటిక్ ఫార్మెట్ లో కాకుండా కథ,కథనాలు రియలిస్టిక్ గా ఉంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ తో ప్రేక్షకులను ఒక షాక్ కి గురిచేసాడు దర్శకుడు. నేను చనిపోయాను అని ఒక మనిషి చెప్పడం ఏంటి..? అసలు అతను చనిపోయాడనే భ్రమలోకి ఎలా వెళ్ళాడు అనే ట్విస్ట్ ని బాగా డవలెప్ చేసి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ తో కన్వెన్స్ గా చెప్పగలిగాడు. నేను లేను అనే సినిమాలో పెన్ పవర్ ఎక్కువుగా కనిపిస్తుంది. ఒక లిమిటెడ్ పరిస్థితుల్లో , లిమిటెడ్ పాత్రలతో నడిచే కథ అయినా ఆ ఫీల్ ఎక్కడా కలగకపోవడానికి క్యారెక్టర్స్ ని డవలెప్ చేయడంలో దర్శకుడు తీసుకున్న శ్రర్ద బాగుంది. ఇక ఈ సినిమాకు మెయిన్ హైలైట్ ఛాయాగ్ర‌హ‌ణం. ఎ. శ్రీ‌కాంత్ (బి.ఎఫ్‌.ఎ) తన లైటింగ్ తో మెస్మరైజ్ చేశాడు. చాలా సీన్స్ తో తన ప్రతిభ చూపించాడు. లిమిటెడ్ బడ్జెట్ లో గ్రాండియర్ విజువల్స్ అందించాడు. నిర్మాత సుక్రి కుమార్ నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. కొత్తదనం నిండిన కథా, కథనాలను ఇష్టపడేవారికి ‘నేను లేను’ సినిమలో ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయి. అల్లరిగా కనిపించే ప్రేమకథ వెనక ఒక ఎమోషనల్ జర్నీ ని అంతర్లీనంగా చూపించాడు. క్లైమాక్స్ ఫైట్ ని కమర్షియల్ ఫార్మెట్ లో తీసినా, కథ, కథనాలలో ట్విస్ట్ లు ‘నేను లేను ’ సినిమాకు హైలెట్ గా మారాయి.

చివరిగా:
ఆకట్టుకునే ప్రయత్నం

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *