అందుకు కారణం ఆ సదుపాయాలే : సీఎం జగన్

ప్రపంచ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో నిలిచేలా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. టూరిజం, ఆర్కియాలజీ, యూత్‌ ఎఫైర్స్‌ శాఖలపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రదేశాల్లో 15 నుంచి 20 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసి, అంతర్జాతీయంగా పేరున్న సంస్థల సహకారంతో వాటిని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో సెవెన్‌స్టార్‌ తరహా సదుపాయాలున్న హోటళ్లు తీసుకురావాలని, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి కార్యాచరణ సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. టూరిజంతో పాటు చారిత్రక ప్రాంతాల అభివృద్ధి, అన్ని జిల్లాల్లో క్రీడా సదుపాయాల ఏర్పాటుపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది.

భారతదేశంలో అడుగుపెట్టే ప్రతి పర్యాటకుడు రాజస్థాన్‌ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంటున్నారని, అక్కడ పర్యాటక ప్రాంతాల్లో అంతర్జాతీయ సదుపాయాలు ఉండడమే దీనికి కారణమని జగన్ అన్నారు. రాష్ట్రంలో ఈ స్థాయిలో అభివృద్ధిచేయాల్సిన ప్రాంతాలను ముందుగా ఎంపిక చేసిన తనకు వివరాలు తెలియజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆతిథ్యరంగంలో, పర్యాటక రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలున్న సంస్థలు హోటళ్లను ఏర్పాటు చేసేలా ఇక్కడ ఉత్తమ సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనివల్ల రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలపై సహజంగానే అంతర్జాతీయస్థాయిలో మంచి ప్రచారం లభిస్తుందన్నారు. అభివృద్ధి చేయాల్సిన పర్యాటక ప్రాంతాలను గుర్తించిన తర్వాత వాటిని మార్కెటింగ్‌ చేయడంపైన కూడా దృష్టి పెట్టాలన్నారు.

TV5 News

Next Post

పిచ్చోడి చేతిలో రాయిలా జగన్‌ పాలన : అయ్యన్నపాత్రుడు

Sat Oct 12 , 2019
ఏపీలో ఇసుక కొరతకు నిరసనగా 36 గంటల దీక్షకు సిద్ధమైన కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ రవీంద్ర సహా అందరినీ బలవంతంగా తరలించారు. అటు కృష్ణా జిల్లాలో పలువురు టీడీపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. తాము ప్రజాసమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం అడ్డుకోవడం ఏంటని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఏపీ సర్కార్‌ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ వైఖరితోనే రాష్ట్రంలో ఇసుక కొరత […]