15వ ఆర్ధిక సంఘం ముందు స్పెషల్ స్టేటస్ అంశాన్ని వినిపించండి : సీఎం జగన్

పరపాలనపై పట్టు బిగిచేందుకు, వివిధ శాఖల్లో నెలకొన్న పరిస్థితులపై అవగాహన కోసం వరస సమీక్షలు నిర్వహిస్తున్నారు సీఎం జగన్. ఇందులోభాగంగా శనివారం ఆర్ధికశాఖపై సమీక్ష నిర్వహించారు. అప్పులతో కుదేలైన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, సమస్యలపై సమగ్రంగా నివేదిక ఇవ్వాలన్నారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న తరుణంలో రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షన ఆవశ్యతను అధికారులకు వివరించిన జగన్..అన్ని శాఖల్లోనూ ఆర్ధిక క్రమశిక్షణ పాటించాల్సిందేనని తేల్చి చెప్పేశారు. ఆర్ధిక సమస్యల నుంచి ఉపశమనం దక్కాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం ఉందన్న జగన్..15వ ఆర్ధిక సంఘం ముందు ఏపీకి స్పెషల్ స్టేటస్ అవసరాన్ని వినిపిస్తూ సమర్ధవంతంగా వాదనలు వినిపించాలని సూచించారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

మైదానంలో మాయ చేసే అందం..చిన్న స్కర్టుతో..

Sat Jun 1 , 2019
టీవీలో ప్రసారమయే ఏ కార్యక్రమానికి ఆయన సెంటర్ అఫ్ అట్రాక్షన్‌ యాంకరే. పోగ్రాం చూసే ప్రేక్షకుల దృష్టి ముందుగా వచ్చే యాంకర్‌పైనే ఉంటుంది.. కొందరు మాటలతో ఆకట్టుకుంటే.. మరికొందరు. రూపంతో ఆకర్షిస్తారు. అలా అందంతో ,మాటలతో ప్రేక్షకులను ఆకట్టి పడేస్తుంది ఓ భామ. దేశంలో మోస్ట్ ఫేవరేబుల్ వ్యాఖ్వతగా క్రికెట్,పుట్‌బాల్ అబిమానులకు తెగ నచ్చేసింది ఆ యంగ్ ఆండ్ డైనామిక్ యాంకర్. క్రికెట్‌, ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని […]