చేసిన ఖర్చుకు ఫలితం రావాలి : సీఎం జగన్

జలవనురల శాఖపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కృష్ణా, గోదావరి, పెన్నా బేసిన్లలోని రిజర్వాయర్ల నీటిమట్టాలు, ప్రస్తుత పరిస్థితిని సీఎంకు వివరించారు అధికారులు. ప్రాంతాలు, ప్రాజెక్టులు, జిల్లాల వారీగా జరుగుతున్న పనుల వివరాలను నివేదిక రూపంలో అందించారు. ఇప్పటికే పనులు జరుగుతున్న పోలవరం, వెలిగొండ, వంశధార సహా కొత్తగా ప్రతిపాదించిన ప్రాజెక్టులపైనా అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు సీఎం…

వర్షాలు బాగా పడినా కొన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండకపోవడంపై సీఎం ఆరా తీశారు. కాల్వల సామర్థ్యం, పెండింగులో ఉన్న పనులపై అధికారుల నుంచి సమాచారం కోరారు జగన్. ప్రస్తుతం పనులు జరుగుతున్న, కొత్తగా చేపట్టాల్సిన ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో విభజించి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నిధుల వినియోగంలోచాలా జాగ్రత్తగా వ్యవహరించాలని…ప్రాధాన్యతల పరంగా ఖర్చు చేయాలని సూచించారు.. చేసిన ఖర్చుకు ఫలితం వచ్చేలా ఉండాలన్నారు సీఎం జగన్. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణపై ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు.

TV5 News

Next Post

గన్నవరం చేరుకున్న చంద్రబాబు

Mon Oct 28 , 2019
హైదరాబాద్‌ నుండి గన్నవరం విమానాశ్రయానికి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు చంద్రబాబుకి స్వాగతం పలికారు. ఇటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేసిన నేపథ్యంలో.. చంద్రబాబు అక్కడికి చేరుకోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.