పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు..

మధ్యప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. అసభ్య పదజాలంతో తిడుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. నన్నే అడ్డుకుం టావా అంటూ పోలీసులపై చేయి కూడా చేసుకున్నారు. మధ్యప్రదేశ్ మంత్రి సజ్జన్‌ సింగ్‌ వర్మ ఆధ్వర్యంలో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ లోకల్ లీడర్ సన్నీ రాజ్‌పాల్ కూడా ఆ సమావేశంలో పాల్గొనడానికి వచ్చాడు. తనను మంత్రి వద్దకు వెళ్లనివ్వాలని పోలీసు అధికారిని కోరాడు. ఐతే, అనుమతి లేదంటూ మంత్రిని కలవడానికి సన్నీ రాజ్‌పాల్‌ను సదరు పోలీసు అధికారి అడ్డుకున్నాడు. దీంతో సన్నీ రాజ్‌పాల్ రెచ్చిపోయాడు. అసభ్యకరంగా మాట్లాడుతూ పోలీసు ఆఫీసర్‌పై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు తీవ్రంగా మండిపడ్డారు. రాజ్‌పాల్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

చిరంజీవి ఇచ్చిన 'ఐడియా'తో ఆ చిత్రం సూపర్ హిట్..

Mon Jun 17 , 2019
కొన్ని కథలు కంచికి చేరితే.. కొన్ని కథలు మాత్రం తరాలు గుర్తు పెట్టుకునేలా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచి పోతాయి. అతిలోక సుందరి అనగానే అరక్షణమైనా తడుముకోకుండా గుర్తొచ్చే అందమైన రూపం శ్రీదేవి. ఆమెని చూసే సినిమాకు ఆ టైటిల్ సెట్ చేశారేమో దర్శకుడు రాఘవేంద్రరావు అన్నంత అందం శ్రీదేవి సొంతం. తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పటికి మరిచిపోలేని ఆణిముత్యం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’… మెగాస్టార్ చిరంజీవి జగదేకవీరుడిగా.. […]