ఏసీబీ వలకు చిక్కిన అవినీతి అధికారి

c

శ్రీకాకుళం జిల్లాలో ఓ అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శ్రీకాకుళంలో ఇంటర్‌ మీడియట్‌ బోర్టు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి గుంటుకు రమణారావును ఏసీబీ అధికారులు వల వేసి పట్టుకున్నారు. సోంపేటలోని ఓ ప్రైవేటు జూనియర్‌ కాలేజ్‌లో కొత్త అడ్మిషన్ల పరిశీలన, అనుమతుల కోసం 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఫైలుపై సంతకం కోసం ఆర్‌ఐఓ డబ్బులు డిమాండ్‌ చేస్తూ.. అక్టోబర్‌ 30వ తేదీ నుంచి పెండింగ్‌లో పెట్టారు.

దీంతో బాధితుడైన ప్రైవేటు కాలేజీ కరస్పాండెంట్‌ రామారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అతడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. శ్రీకాకుళం ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయంలో డబ్బులు తీసుకుంటుండగా రమణారావును పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆర్‌ఐఓను కోర్టులో హాజరుపరిచారు.

TV5 News

Next Post

దశాబ్దాల సమస్యలకు బీజేపీ పరిష్కారం చూపింది: లక్ష్మణ్

Tue Nov 12 , 2019
సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని పొన్నాల గ్రామ శివారులో బీజేపీ కార్యాలయానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ భూమి పూజ చేశారు. త్వరలో 8 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు భూమిపూజ చేస్తామన్నారు. ఇప్పటికే దేశంలో చాలాచోట్ల బీజేపీ అధికారంలోకి వచ్చిందని.. సిద్ధిపేటలోనూ బీజేపీ బలపడుతోందని అన్నారు. ప్రధాని మోదీ చేపట్టిన అభివృద్ధి పనులకు, నిర్ణయాలకు ప్రజల మద్దతు లభిస్తోంది అన్నారు. దేశంలో అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్‌ కల్పించింది […]