చుట్టూ ఎవరూ లేరు కదా అని రొమాన్స్ చేసుకున్న చిలిపి జంట.. ప్రపంచానికి పంచేసిన గూగుల్..

ఈమధ్య పార్కుల్లో నిర్జన ప్రదేశాల్లో ప్రేమికుల చిలిపి పనులు మరింత ఎక్కువై పోయాయి. అయితే ప్రేమ జంటలు ఎక్కడపడితే అక్కడ రొమాన్స్ మొదలుపెడితే గూగుల్ నేను వదలను అంటోంది. గూగుల్ స్ట్రీట్ వ్యూ మొత్తం రికార్డు చేసి ఇంటర్నెట్లో పెట్టేస్తుంది. తాజాగా గూగుల్ స్ట్రీట్ వ్యూ దెబ్బకు ఓ ప్రేమజంట బకరా అయింది. తైవాన్‌ తైచుంగ్ నగరంలోని శాంటియన్ రోడ్‌ ప్రాంతానికి చెందిన ఓ జంట ఎవరూలేని ప్రాంతంలోకి వెళ్లారు.. ఇంతలో రొమాన్స్‌ మొదలుపెట్టారు. దుస్తులు విప్పేసి నగ్నంగా ఒకరినొకరు కౌగిలించుకొని లోకాన్ని మరిచిపోయారు.అయితే గూగుల్ శాటిలైట్ మ్యాప్‌లో తైచుంగ్ నగరంలోని శాంటియన్ రోడ్‌ స్ట్రీట్ వ్యూ చూసేవాళ్లకు ఈ చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో వారి ఏకాంత క్షణాలను గూగుల్ స్ట్రీట్ వ్యూ కెమేరా క్లిక్ చేసి నేరుగా మ్యాప్‌లకు అప్‌లోడ్ చేసింది. దీంతో ఆ జంట ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. కొందరు ఆకతాయిలు దీన్ని ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. గూగుల్ మ్యాప్‌లోకి వెళ్లి శాంటియన్ రోడ్‌లో ఆ చిలిపి జంటను చూసేందుకు నెటిజన్లు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. చుట్టూ ఎవరూ లేరు కదా.. ఏదైనా పాడుపని చేసేద్దాం.. అని ఆలోచన వస్తే మాత్రం గూగుల్ స్ట్రీట్ వ్యూ ఉందని మాత్రం మరచిపోకండి.

TV5 News

Next Post

హుజూర్ నగర్ లో కాంగ్రెస్ కు షాక్.. కీలకనేత గుడ్ బై..

Wed Oct 9 , 2019
తెలంగాణలో హుజూర్ నగర్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. అధికార టిఆర్ఎస్, సిట్టింగ్‌ కాంగ్రెస్ తో పాటు బీజేపీ, టీడీపీ కూడా ఈసారి రంగంలో నిలబడటంతో హుజూర్‌నగర్‌ ఉప పోరు రక్తికట్టిస్తోంది. అన్ని పార్టీలు తమ బలగాలన్నింటినీ అక్కడే మోహరించాయి. TRS ఈ ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గతంలో హుజూర్‌ నగర్‌లో జరిగిన మూడు ఎన్నికల్లోనూ ఓటమి పాలయినా ఈసారి కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. పార్టీ […]