కరెంట్‌ షాక్‌తో ఐదుగురు విద్యార్థులు మృతి

కరెంట్‌ షాక్‌తో ఐదుగురు విద్యార్థులు మృతి

కర్నాటక రాష్ట్రంలోని కొప్పల్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రభుత్వ పాఠశాల హాస్టల్‌లో విద్యుత్‌ షాక్‌తో ఐదుగురు విద్యార్థులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. హాస్టల్‌ భవనంపై స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జెండా స్తంభాన్ని తొలగిస్తున్న సమయంలో... అనుకోకుండా ఆ పోల్‌ హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలను తాకింది. దీంతో పోల్‌ పట్టుకున్న ఇద్దరు విద్యార్థులకు విద్యుత్‌ షాక్‌ తగలడంతో... వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు విద్యార్థులు కూడా అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. విద్యార్థుల మృతితో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.

వెంటనే విషయం తెలుసుకున్న పోలీస్‌ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు.

మరోవైపు ఈ ఘటనపై సీఎం యడియూరప్ప విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. హాస్టల్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డలను కోల్పోయామని మృతుల కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్‌ను ఓ ప్రైవేట్‌ బిల్డింగ్‌లో నిర్వహిస్తున్నట్లు ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story