చేజారిన ఫోన్‌ కోసం కిందికి వంగడంతో పట్టు తప్పి పట్టాలపైకి.. శరీరం రెండు ముక్కలు..

తను దిగాల్సిన స్టేషన్ వచ్చిందని రైలు ఎంట్రన్స్ దగ్గరకి వచ్చింది. ఇంతలో చేతిలో ఫోన్ పడిపోయింది. దాన్ని తీసుకునే ప్రయత్నంలో ముందుకు వంగేసరికి ఎంఎంటీఎస్ ట్రైన్‌లోనించి జారి పడిపోయింది. దాంతో ఆమె శరీరం రైలు చక్రాల కింద నలిగి రెండు ముక్కలుగా విడిపోయింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్‌ సమీపంలో జరిగింది. నగరంలోని ఓ ప్రైవేట్ సంస్థలో చిరుద్యోగిగా పనిచేస్తున్న రాంచందర్ సీతాఫల్ మండి బీదల బస్తీలో భార్యా పిల్లలతో నివసిస్తున్నాడు. ఆయన కుమార్తె అశ్విని బేగంపేట దగ్గర ఉన్న ఓ ఫ్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తోంది. రోజులానే విధులకు హాజరయ్యేందుకు బుధవారం ఉదయం 9.30 గంటలకు ఎంఎంటీఎస్ ఎక్కింది. తను దిగవలసిన స్టేషన్ రావడంతో దిగే ప్రయత్నంలో చేతిలో ఉన్న ఫోను జారి పడిపోయింది. దాన్ని తీసుకునేందుకు ముందుకు వంగడంతో రైల్లోనుంచి పడిప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఫోన్ ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పట్టాలపై ఛిద్రమైన కుమార్తె శరీర భాగాలను చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చేతిలోఫోను, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ప్రయాణించడం ఎంతో ప్రమాదకరమని చెప్పినా ప్రజలు వినిపించుకోవడం లేదని పోలీసులు వాపోతున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *