ముద్దు పెట్టుకోనివ్వలేదని బాలికను అతి దారుణంగా..

బాలికా సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా.. నిర్భయ వంటి చట్టాలు అమలవుతున్నా..  అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలపై  కఠిన చట్టాలు వస్తున్నప్పటికీ.. బాలికలపై దారుణాలు మాత్రం ఆగడం లేదు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఓ వైపు దేశం మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు నీచుల అరాచకాలకు అడ్డే లేకుండా పోతోంది. తాజాగా ఓ యువకుడు ముద్దు పెట్టుకోనివ్వలేదన్న కోపంతో తన స్నేహితురాలినే కొట్టి చంపేశాడు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది.

జబల్‌పూర్ జిల్లాలోని బీజాపురి గ్రామానికి చెందిన ఓ బాలిక (18) స్థానిక పాఠశాలలో ప్లస్‌టూ చదువుతోంది. సెప్టెంబర్ 5వ తేదీన స్కూల్‌కి వెళ్లిన ఆమె.. ఇంటికి రాలేదు. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెక్ట్స్ డే పోలీసులు.. స్కూల్ సమీపంలోని పొదల్లో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. కుటుంబసభ్యులు, స్నేహితులు, క్లాస్‌మేట్స్‌ను విచారించారు. ఈ నేపథ్యంలో బాలిక క్లాస్‌మేట్ రమణ్‌సింగ్ సయ్యంను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో రమణ్‌సింగ్‌ను ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించాడు.

సెప్టెంబర్ 5వ తేదీన స్కూల్ ముగిశాక.. దగ్గరలోని కాలువ వద్దకు బాలికను తీసుకు వెళ్లానని పోలీసులకు తెలిపాడు. కిస్ అడిగితే నో చెప్పిందని.. దీంతో బలవంతంగా ముద్దు పెట్టుకునేందుకు ట్రై చేశానని.. కానీ ఆమె పక్కకు తోసేసిందని తెలిపాడు. దీంతో కోపం వచ్చి బండరాయితో తలపై బలంగా కొట్టానని.. ఆమె కింద పడిపోవడంతో.. భయంతో అక్కడ నుంచి వెళ్లిపోయానని పోలీసులకు వివరించాడు. ఈ ఘటనపై పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also watch :

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *