విద్యార్థి ఆదిత్య హత్యకు అసలు కారణం ఏంటంటే..

విద్యార్థి ఆదిత్య హత్యకు అసలు కారణం ఏంటంటే..

రాత్రి మర్డర్ చేసి ఉదయాన్నే హాస్టల్ గేటు దగ్గర ఉన్నాడు. పని వుండడం వల్ల రాత్రి హాస్టల్‌కు రాలేదని వార్డెన్‌తో చెప్పాడు. విన్నారుగా... కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు చెప్పింది. ఓ టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఎంత పెద్ద స్కెచ్ వేశాడో. మూడో తరగతి విద్యార్థి ఆదిత్యను దారుణంగా హత్య చేసి తప్పించుకోడానికి ఖతర్నాక్ ప్లాన్ వేశాడు. సేమ్‌ టు సేమ్ దృశ్యం సినిమా సీన్‌ను తలపించేలా ఎస్కేప్ కావాలనుకున్నాడు. రాత్రి 2 గంటలకు ఆదిత్యను హత్య చేసి... రాత్రి తను హాస్టల్‌లో లేనట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసుల ముందు అతడి జిత్తులు పారలేదు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు..

కృష్ణా జిల్లా చల్లపల్లి బీసీ హాస్టల్‌లో ఆదిత్య మర్డర్

పెన్సిల్ చెక్కే చాకుతో ఆదిత్య మర్డర్

కృష్ణా జిల్లా చల్లపల్లి బీసీ హాస్టల్‌లో జరిగిన మూడో తరగతి స్టూడెంట్ ఆదిత్య మర్డర్ కేసులో వెలుగు చూసిన నిజం ఇది. పెద్దలపై ఉన్న పాత కక్షలే ఈ హత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానించారు. అదే కోణంలో మొదట విచారణ చేపట్టారు. కానీ హంతకుడు అదే హాస్టల్‌లో ఉన్న టెన్త్ స్టూడెంట్ అని తెలుసుకుని షాకయ్యారు. పెన్సిల్ చెక్కే చాకుతో ఆదిత్య మెడ కోసి దారుణంగా చంపేశాడు.

పసివాళ్లలో చంపేంత పగ ఎందుకు వచ్చింది?

స్కూల్లో గోళీల ఆట ఆడేటప్పుడు గొడవ

అమ్మను తిట్టాడని పగ పెంచుకున్న టెన్త్ స్టూడెంట్

టెన్త్ స్టూడెంట్‌పై అతడి తండ్రి నేర చరిత్ర ప్రభావం

కలిసి ఆడుకోవల్సిన వయసు. పగా, ప్రతీకారాలు వంటి కల్మషంలేని మనసులు. అలాంటి పసివాళ్లలో చంపేంత పగ ఎందుకు వచ్చింది? దీనిపై ఆరా తీసిన పోలీసులు కారణాలు తెలుసుకుని విస్తుపోయారు. ఎందుకంటే ఈ ఇద్దరి మధ్య స్కూల్లో, హాస్టల్‌లో చిన్న చిన్న తగాదాలు వచ్చాయి. స్కూల్లో గోళీల ఆట ఆడేటప్పుడు గొడవ జరిగింది. దాన్ని ఆదిత్య మరిచిపోయాడు. కానీ టెన్త్ స్టూడెంట్ దాన్ని మనసులో పెట్టుకున్నాడు. మళ్లీ హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థి బట్టలు ఉతుకుతుండగా ఆ నీళ్లు ఆదిత్యపై పడ్డాయి. దానికి ఆగ్రహించిన ఆదిత్య ఆవేశంలో తిట్టేశాడు. అయితే తను ఎంతగానో ఇష్టపడే అమ్మను ఆదిత్య తిట్టడంతో జీర్ణించుకోలేకపోయాడు టెన్త్ స్టూడెంట్. పగ తీర్చుకోడానికే ఇంత దారుణానికి ఒడిగట్టాడు. అయితే నిందితుడికి మానసిక ప్రవర్తన సరిగా లేదంటున్నారు పోలీసులు. అతడి తండ్రికి కూడా నేర చరిత్ర ఉండడంతో ఆ ప్రభావం పసివాడిపై పడినట్లు చెప్తున్నారు.

వార్డెన్, ఇంఛార్జీల నిర్లక్ష్యంతో ఆదిత్య మర్డర్

వార్డెన్‌, ఇంఛార్జీలను సస్పెండ్ చేసిన కలెక్టర్

ఆదిత్య హత్యతో హాస్టల్‌ వార్డెన్, ఇంఛార్జీల నిర్లక్ష్యం బయటపడింది. వీరిద్దరూ అలర్ట్‌గా ఉండివుంటే ఇంత దారుణం జరిగేది కాదు. ఎందుకంటే టెన్త్ స్టూడెంట్ చంపేటప్పుడు ఆదిత్య అరిచి ఉంటాడు. ఈ ఇద్దరిలో ఎవరు హాస్టల్‌లో ఉన్నా... ఈ కిరాతకాన్ని వెంటనే అడ్డుకునేవాడు. ఇక విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ వార్డెన్, ఇన్‌ఛార్జ్‌లను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ సస్పెండ్ చేశారు. ఆదిత్యను హత్య చేసిన నిందితుడిని చికిత్స కోసం పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story