8వ తరగతి బాలికను పెళ్ళి చేసుకున్న టీచర్

పవిత్ర ఉపాధ్యయవృత్తికే కళంకం తెచ్చేలా చేశాడు తూర్పుగోదావరి జిల్లాలో ఒక టీచర్‌. వైరామవరం మండలం దాలిపాడు గ్రామంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థిని 8వ తరగతి చదువుతోంది. మాయమాటలు చెప్పి ఆ బాలికను లోబరుచుకున్నాడు టీచర్‌ చిన్నబ్బాయ్. విషయం గ్రామస్థులు, తల్లిదండ్రులకు తెలిసి ఆ కీచకుడిని నిలదీశారు. దీంతో రహస్యంగా పెళ్లిచేసుకుని ఆతర్వాత కంటికి కనిపించకుండా పోయాడు చిన్నబ్బాయ్. ఈ ఘటనపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *