దసరా నవరాత్రులకు TV5 స్పెషల్ ప్రోగ్రాం.. హిందూధర్మం ఛానెల్‌లో ‘నవనాయకి’ గేమ్‌ షో

Read Time:0 Second

దసరా పండుగ మహిళలకెంతో సరదా సంతోషాలను తీసుకువస్తుంది. బతుకమ్మల కోలాహలం.. దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు.. ప్రతి ఇల్లూ రంగుల హరివిల్లవుతుంది. దసరా తొమ్మిది రోజులు ప్రతి రోజు పండుగలానే అనిపిస్తుంది. కోలాటాలు, బతుకమ్మ ఆట పాటలతో, తెలుగింటి ఆడపడుచులు ఆనందపారవశ్యంలో మునిగి తేలుతుంటారు. ఈ సంబరాలను వినోదాత్మకంగా నిర్వహించాలని తలపోసింది టీవీ5 ఆధ్యాత్మిక ఛానెల్ హిందూధర్మం.

నారీ మణుల కోసం ‘నవనాయకి’ అని ప్రత్యేక గేమ్‌షో నిర్వహించనుంది. అదృష్టలక్ష్మి నిర్వాహకులు, మైసూరు దత్తపీఠ ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ కొడకండ్ల శ్రీరామశరణ్‌ గురూజీ ఆధ్వర్యంలో ఈ గేమ్‌ షో నిర్వహించనున్నారు. మీరూ ఈ గేమ్‌లో పాల్గొనదలిస్తే ఇద్దరు మహిళలు జంటగా దిగిన ఫోటోతో పాటు, వివరాలను 7337555114కు వాట్సప్ చేయగలరు. షోలో పాల్గొన్న మహిళలందరికీ గురువుగారి చేతులు మీదుగా గిఫ్ట్‌ హ్యాంపర్స్‌ అందించబడును. ఈ కార్యక్రమానికి సెలెక్ట్‌ అయిన వారికి ఫోన్‌ ద్వారా వివరాలు తెలియజేయబడతాయి. మీ ఎంట్రీలకు ఆఖరు తేదీ సెప్టెంబర్‌ 15, 2019.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published.

Close