అమెరికాలో భారతీయులకు భారీ ఊరట

visa

అమెరికాలో భారతీయులకు భారీ ఊరట లభించింది. హెచ్‌-1బి వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అనుమతులు రద్దు చేస్తూ ట్రంప్ సర్కారు జారీ చేసిన ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో భారతీయులకు భారీ లబ్ధి చేకూరనుంది.

ఆమెరికాకు వలసదారులను తగ్గించటమే లక్ష్యంగా కొత్త కొత్త నిబంధనలు తీసుకొచ్చిన ట్రంప్..హెచ్-4 వీసా అనుమతులపై ఫోకస్ చేశారు. హెచ్-4 వీసాల నిబంధనలను కఠిన తరం చేశారు. దీంతో హెచ్-1బీ వీసాదారులపై గుండెల్లో బాంబు పేలినంత పనైంది. హెచ్-4 వీసా అనేది హెచ్-1బీ వీసాదారుల జీవితభాగస్వామ్యులు కూడా ఉద్యోగం చేసుకునేందుకు ఇచ్చే వీసా. అమెరికాలో 1.2 లక్షల మంది ఇలా ఉద్యోగాలు చేస్తున్నట్టు అంచనా. దీంతో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయనే కారణంతో హెచ్-4 వీసాలను నిబంధనలను మరింత కఠినతరం చేశారు. దీంతో హెచ్-1బీ వీసాదారుల జీవితభాగస్వామ్యుల ఉద్యోగాలు గల్లంతయ్యాయి.

ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.హెచ్-4 వీసాలను రద్దు చేస్తే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుందని, ఉద్యోగ విధానాల్లో పారదర్శకత లోపిస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపిన యూఎస్ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్స్ కొలంబియా సర్క్యూట్స్‌.. హెచ్‌-1బి వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అనుమతులు రద్దు చేస్తూ ట్రంప్ సర్కారు జారీ చేసిన ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని యూఎస్ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్ కొలంబియా సర్క్యూట్ దిగువ కోర్టును కోరింది. నిబంధనల్ని క్షుణ్నంగా పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని ఆదేశించింది. అప్పటివరకు నిబంధనలను నిలుపుదల చేయడం ఉత్తమమని అభిప్రాయపడింది.

హెచ్-4 వీసాల కింద వేలాది భారతీయులు, ఇతర దేశాల వారు అమెరికా సంస్థల్లో పనిచేస్తున్నారు. హెచ్-1బీ వీసా తర్వాత హెచ్-4 వీసాకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. కోర్టు ఆదేశాలతో హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వామ్యులు కూడా ఉద్యోగాలు చేసుకునే అవకాశం దొరికింది.

TV5 News

Next Post

కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు పెరిగిన ఇన్‌ఫ్లోలు

Mon Nov 11 , 2019
కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లోలు మళ్లీ పెరిగాయి. ఎగువన ఆల్మట్టి మొదలు దిగువన ప్రకాశం బ్యారేజ్‌ వరకు ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉండగా.. వచ్చిన వరద వచ్చినట్టుగా కిందుకు వదులుతున్నారు అధికారులు. ఆల్మటికి 22 వేల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో వస్తోంది. అంతే మొత్తం నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. నారాయణపుర రిజర్వాయర్‌కు 33 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. జూరాల జలాశయానికి 80 వేల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో నమోదవుతోంది. స్పిల్‌వే ద్వారా […]