పేకమేడలా కుప్పకూలిన బిల్డింగ్..

ఢిల్లీ కే బ్లాక్ జేజే కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం అర్థరాత్రి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. గాయపడ్డ మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిధిలాల్లో చిక్కుకున్న రెండు మృతదేహాలను వెలికి తీశారు. గాయపడ్డ ముగ్గురిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో భవనం కూలడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఏమైందో అని బయటకు వచ్చి చూసే సరికి నిర్మాణంలో ఉన్న భవనం పేకమేడలా కూలిపడింది. మృతుల కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. నిర్మాణంలో నాణ్యతా లోపమే భవనం కూలడానికి కారణంగా తెలుస్తోంది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ఆ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

Tue Sep 3 , 2019
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి జోరు వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ ప్రభావం మరో 3-4 రోజులపాటు ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక.. హైదరాబాద్‌లో నిన్న(సోమవారం) భారీ వర్షం కురిసింది. అమీర్‌పేట, సంజీవరెడ్డి నగర్, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, బాలానగర్, బోయిన్‌పల్లి, లకడీకపూల్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. చాలా కాలనీలు చెరువులను తలపించాయి. రోడ్లపై నీరు […]