ఢిల్లీ- విజయవాడ ఫ్లైట్‌ మీద పిడుగులు.. విమానంలో 150 మంది

ఢిల్లీ- విజయవాడ ఎయిర్‌యిండియా ఫ్లైట్‌లో ప్రయాణికులకు క్షణకాలం గుండె ఆగినంత పనైంది. నిన్న రాత్రి 7:28కి ఢిల్లీలో బయలుదేరిన AI-467 విమానం.. దారిలో ఉరుములు, పిడుగుల ధాటికి భారీ కుదుపులకు గురైంది. టేకాఫ్ అయినప్పటి నుంచే వర్షం మొదలైంది. ఐతే.. దీన్ని ప్రతికూల వాతావరణంగా పరిగణించాల్సిన అవసరం లేదని భావించడంతో పైలట్ కూల్‌గా ఫ్లైట్ నడుపుతున్నారు. ఇంతలో ప్రచండ గాలులకు విమానం అటు ఇటు ఊగిపోయింది. భారీ పిడుగులు కూడా పడడంతో ఆ ప్రభావానికి ఫ్లైట్‌ షేకయిపోయింది. ఫుడ్ పార్శిళ్లు, వాటర్ బాటిళ్లు కింద పడిపోయాయి. లోపలున్న ప్రయాణికులకు ఓ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ సమయంలో విమానంలో 150 మంది ఉన్నారు. అదృష్టవశాత్తూ వీళ్లలో ఎవరికీ ఏమీ జరగలేదు. ఫ్లైట్ సిబ్బందిలో ఒకరిద్దరు స్వలంగా గాయపడ్డారు. చివరికి రాత్రి 9:40కి ఫ్లైట్ గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనపై ఎయిర్‌ఇండియా విచారణకు ఆదేశించింది.

Also watch :

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

'నమో' మెనూ ఇదే.. వంట చేసేది ఎవరో తెలుసా?

Sun Sep 22 , 2019
వారం రోజుల పాటు అమెరికాలో పర్యటనలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం అక్కడ ప్రత్యేక మెనూ రెడీ అయింది. హోస్టన్‌ కు చెందిన ప్రముఖ చెఫ్‌ కిరణ్‌ వర్మ ప్రధాని కోసం ప్రత్యేకంగా తయారుచేసిన నమో తాలి సేవ్రి, నమో తాలి మిఠాయి పసందైన వంటకాలను వడ్డించనున్నారు. మోదీ కోసం ఈ వంటకాలన్నీ స్వచ్ఛమైన దేశీ నెయ్యితో తయారు చేస్తున్నారు. ప్రధాని మెనూలో పలు రకాల పచ్చళ‍్లను […]