మృతదేహాలకు పూర్తయిన పంచనామా..

Read Time:1 Second

encounterలదిశ కేసులో ఎన్‌కౌంటర్‌ అయిన నలుగురు నిందితుల మృతదేహాలను మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు…అక్కడ పోస్ట్‌మార్టమ్ పూర్తైన తర్వాత డెడ్‌బాడీస్‌ను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. అంతకుముందు..ఘటనాస్థలంలోనే పంచనామా నిర్వహించారు. క్లూస్‌టీమ్, ఫోరెన్సిక్‌ నిపుణుల సమక్షంలో పంచనామా చేశారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతానికి ఆ నలుగురు నిందితుల కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చారు. మృతదేహాలను వారికి చూపించారు.

నలుగురు నిందితులకు నలుగురు ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌లు పంచనామా చేశారు. A-1 మహ్మద్ అరిఫ్ మృతదేహానికి ఫరూక్‌నగర్ తహసీల్దార్‌, A2- చెన్నకేశవులు డెడ్‌బాడీకి కొందుర్గ్ తహసీల్దార్, A3-శివ మృతదేహానికి నందిగామ తహసీల్దార్, A-4 నవీన్ డెడ్‌బాడీకి చౌదరిగూడ తహసీల్దార్‌ పంచనామా చేశారు. అటు ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో క్లూస్‌ టీమ్ గన్స్ సీజ్ చేసింది…12 బుల్లెట్లను కూడా రికవరీ చేశారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close