దిశ కేసులో కీలక మలుపు

disa

దిశ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.. కేసు విచారణను వేగవంతం చేసేందుకు ఫాస్ట్‌ కోర్టు ఏర్పాటు అయ్యింది.. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబర్‌నగర్‌లో ఈ ఫాస్ట్‌ ట్రాక్‌కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మహబూబ్‌నగర్‌లోని 1వ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌‌, సెషన్స్‌ జడ్జికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు విధివిధానాలు నిర్ణయించిన తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్‌కు సూచించింది..

షాద్‌నగర్‌ సమీపంలో జరిగిన దిశ హత్యాచారం కేసు యావత్‌ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో నిందితులపై సత్వరమే విచారణ జరిపి..వెంటనే ఉరితీయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను వేగవంతంగా కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటుతో విచారణను వేగంగా పూర్తిచేసి.. ఈ కేసులో దోషులను తేల్చి.. కఠినశిక్ష విధించాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. దీనిపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

TV5 News

Next Post

ట్రంప్ అధికార దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో తేలింది : కాంగ్రెస్

Wed Dec 4 , 2019
వ్యక్తిగత ప్రయోజనాల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో తేలిందని కాంగ్రెస్ తెలిపింది. అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్ధి జో బిడెన్ మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలంటూ ట్రంప్ ఉక్రెయిన్ ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలను అమెరికన్ కాంగ్రెస్ వెల్లడించింది. గత జులైలో ఉక్రెయిన్ అధ్యక్షుడికి ట్రంప్ చేసిన ఫోన్ కాల్స్ వివరాలతోకూడిన 3వందల పేజీలను హౌజ్ […]