‘దొరసాని’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందోచ్!

పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని రేకెత్తించిన ‘దొరసాని’ జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తిచేసుకొని గ్రాండ్ రిలీజ్ కి సిద్దం అవుతుంది. ఈ చిత్రంతో దర్శకుడిగా కె.వి.ఆర్ మహేంద్ర పరిచయం అవుతున్నాడు.

80వ దశకంలో తెలంగాణా ప్రాంతంలో జరిగిన ఒక స్వచ్ఛమైన ప్రేమకథ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది చిత్ర యూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ‘నింగిలోన పాలపుంత నవ్వులొంపెనే’ పాట దొరసాని పై అంచనాలను పెంచాయి. మరోపాట ‘కలవరమై.. కలవరమై’ ఈనెల 24న రిలీజ్ అవుతుంది. కల్మషం లేని ప్రేమకథగా తెరకెక్కిన ‘దొరసాని’ ప్రేమకథలలో ప్రత్యేకస్థానంలో నిలుస్తుందంటున్నారు దర్శక నిర్మాతలు. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతోన్న ఈ చిత్రంలో కన్నడ కిశోర్, వినయ్ వర్మ, ‘ఫిదా’ శరణ్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిన విజయసాయిరెడ్డి

Sat Jun 22 , 2019
ఓబీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. పార్లమెంట్, అసెంబ్లీలలో ఓబీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగ సవరణ చేయాలని విజయసాయిరెడ్డి కోరారు. ఆర్టికల్-330A, 332Aల ను సవరించి జనాభాకు తగినట్లుగా ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ-ఎస్టీ-మైనార్టీలకు ఉన్నట్లుగానే ఓబీసీలకు కూడా ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు […]