ముగ్గురు మందుబాబులు అర్థరాత్రి యువతిని..

హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌లో మందుబాబులు ఆగడాలు శృతి మించిపోతున్నాయి. తాగిన మైకంలో ముగ్గురు మందుబాబులు ఓ ఎయిర్‌ లైన్స్‌ ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ పోలీసులకు ఆశ్రయించింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

శంషాబాద్‌ విమానాశ్రయంలోని ఓ ఎయిర్‌ లైన్స్‌ సంస్థలో ఉద్యోగిగా పని చేస్తున్న బాధితురాలు.. శుక్రవారం అర్థరాత్రి నడుచుకుంటూ ఇంటికి బయలు దేరింది. ఇది గమనించిన మందుబాబులు ఆమెను బైక్‌పై వెంబడించారు. మందు బాటిళ్లను ఓపెన్‌ చేసి యువతిపై చల్లి వేధింపులకు పాల్పడ్డారు. బాధితురాలు కేకలు వేయడంతో పోకిరీలు అక్కడి నుంచి పరారయ్యారు.

బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికంగా వైన్‌ షాపుల్లో ఉన్న సీసీ ఫుటేజ్‌ను సేకరించారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ఇద్దరు బీట్‌ కానిస్టేబుళ్ల పైకి దూసుకెళ్లిన కారు.. స్పాట్‌లోనే..

Sat Jun 15 , 2019
కడపజిల్లా రాజంపేట మండలం బోయినపల్లె వద్ద దారుణం జరిగింది. బోయినపల్లె వైజంక్షన్‌ వద్ద విధులు నిర్వహిస్తోన్న ఇద్దరు బీట్‌ కానిస్టేబుళ్ల పైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో హెడ్‌ కానిస్టేబుల్‌ ఆదిమూలం మనోహర్‌ స్పాట్‌లోనే మృతి చెందగా మరో కానిస్టేబుల్‌ రమేష్‌కు గాయాలయ్యాయి. గాయపడ్డ కానిస్టేబుల్‌ రమేష్‌ను చికిత్స కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్‌ నుంచి తిరుమలకు వెళుతోన్న కారు వేగంగా వచ్చి వీరిద్దరినీ ఢీకొట్టింది. […]