వేధింపులకు మరో యువతి బలి

తూర్పుగోదావరి జిల్లాలో వేధింపులకు మరో యువతి బలైంది. మామిడికుదురు మండలం గోగన్నమఠం గ్రామానికి చెందిన మధుశ్రీ వేధింపులతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన రాజేష్‌ అనే యువకుడు గత కొన్ని రోజులుగా మధుశ్రీ వెంట పడుతూ వేధిస్తున్నాడు. కాలేజీకి వెళ్లే సమయంలో.. ఇంటికి తిరిగొచ్చే సమయంలో వేధింపులకు పాల్పడేవాడు. దీంతో మనస్తాపం చెందిన మధుశ్రీ ఇంటి ఎదురుగా ఉన్న చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయం తెలిసి గతంలో రాజేష్‌ను పెద్దలు మందలించారు. అయినా పద్దతి మార్చుకోకుండా మధుశ్రీని టార్చర్‌ పెట్టాడని మృతురాలి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రాజేష్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

భారీవర్షాలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు..

Sat Jul 13 , 2019
ఈశాన్య రాష్ట్రాలను వరుణుడు వణికిస్తున్నాడు. జోరుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రాలు తడిసిముద్ద అవుతున్నాయి. ముఖ్యంగా అసోంలో కుండపోత వానలకు రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. బహ్మపుత్ర, దాని ఉప నదులు ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయి. బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపంతో అసోంలో సుమారు 1556 గ్రామాలు జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. 21 జిల్లాలో 8 లక్షలకుపైగా ప్రజలపై ప్రభావం చూపగా ఒక్క బార్పేటలోనే సుమారు 4లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. బస్కా జిల్లాలో పరిస్థితి […]