ఆంగ్ల బోధనపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు- మంత్రి సురేష్

education-minister-suresh
ఇంగ్లీష్‌ మీడియంలో బోధన పేద, మధ్య తరగతి విధ్యార్ధులకు ఎంతో మేలు చేస్తుందన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్‌. ఆంగ్ల బోధనపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారాయన. ఒంగోలు సంతపేటలో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి.. విద్యాభివృద్ధితోనే సమాజ అభివృద్ధి సాధ్యమని.. అందుకు అనుగుణంగానే జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్యను నిర్లక్ష్యం చేశారని మంత్రి సురేష్‌ విమర్శించారు. తమ ప్రభుత్వం మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తుందని.. బడ్జెట్‌లో విద్యకు 16శాతం నిధులు కేటాయించడమే ఇందుకు నిదర్శమన్నారు. నాడు- నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగు పరుస్తున్నట్టు మంత్రి సురేష్‌ తెలిపారు.

TV5 News

Next Post

విషాదం.. ఫంక్షన్‌ హాల్ గోడ కూలి ఐదుగురు మృతి

Sun Nov 10 , 2019
హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో విషాదం చోటు చేసుకుంది. గోల్నాకలో ఉన్న పెరల్‌ గార్డెన్‌ ప్రహారీ గోడ కూలడంతో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. మరి కొందరు శిథిలాల కింద ఉంటారని భావిస్తున్న స్థానికులు.. శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న డిజాస్టర్‌ టీమ్స్‌, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు. రెండు ఆటోలు, దాదాపు పది టూ వీలర్స్‌పై గోడ కూలడంతో […]