విచిత్రం : చింపాంజీలను అటాచ్‌ చేసిన ఈడీ

ఎక్కడైనా మనీ ల్యాండరింగ్ చట్టం కింద సంబంధిన ఆస్తులు, లేదా ఖాతాలను అటాచ్ చేస్తుంది ఈడీ. కానీ విచిత్రంగా చింపాంజీలను అటాచ్ చేసింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌ లో జరిగింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వన్యప్రాణి స్మగ్లర్‌ సుప్రదీప్‌ గుహ గతంలో అక్రమంగా చింపాంజీలను నిర్భంధించాడని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ కేసును ఈడీకి బదిలీచేసింది ప్రభుత్వం.. దాంతో అతను వన్యప్రాణుల అక్రమ రవాణా రాకెట్‌ను నడుపుతున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.

ఇందులో మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తు సాగుతోంది. కేసులో భాగంగా స్మగ్లర్‌ ఇంటి నుంచి మొత్తం ఏడు చింపాంజీలను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకుని కోల్‌కతాలోని అలిపోర్‌ జంతుప్రదర్శన శాలలో ఉంచారు. మనీ లాండరింగ్‌ చట్టంకింద జంతువులను అటాచ్‌ చేయడం చేశారు. అయితే జంతువులను అటాచ్ చేయడం దేశంలో ఇదే మొదటి సారి అని ఈడీ పేర్కొంది. ప్రస్తుతం స్మగ్లర్ సుప్రదీప్‌ గుహ ఈడీ అదుపులో ఉన్నాడు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

శ్రీకళరెడ్డి పేరును పరిశీలిస్తున్న తెలంగాణ బీజేపీ

Sun Sep 22 , 2019
కాంగ్రెస్‌కు కంచుకోట అయిన హుజూర్‌నగర్‌లో ఈసారి తమ బలమేంటో చూపించాలని బీజేపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు.. పార్లమెంటు ఎన్నికల తర్వాత వరుస చేరికలతో బలం పెంచుకుంటున్న బీజేపీ.. ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈనేపథ్యంలోనే టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని నిరూపించేందుకు పక్కా వ్యూహాలతో వారు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఉత్తమ్‌కు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసిన రామ్‌రెడ్డిని తమవైపు తిప్పుకున్నారు. దీని ద్వారా హుజూర్‌నగర్‌లో తమ నెట్‌వర్క్‌ మరింత […]