కశ్మీర్‌పై పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ

కశ్మీర్‌పై పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవడానికి యూరోపియన్ యూనియన్ నిరాకరించింది. కశ్మీరు సమస్య పూర్తిగా భారత్-పాక్ ద్వైపాక్షిక అంశమని ఈయూ తేల్చి చెప్పింది. ఇందులో మూడో పక్షం జోక్యం గానీ, మధ్యవర్తిత్వం ప్రసక్తి కానీ ఉండబోదని స్పష్టం చేసింది. కశ్మీర్ సమస్యను భారత్-పాకిస్థాన్‌లే పరిష్కరించుకోవాలని యూరోపియన్ పార్లమెంట్ పిలుపునిచ్చింది. కశ్మీర్ విషయంలో తమ పాత్ర ఏమీ ఉండబోదని ఈయూ నేతలు తేల్చి చెప్పారు.

ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో యూరోపియన్ యూనియన్ జనరల్ అసెంబ్లీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, పోలండ్, యునైటెడ్ కింగ్‌డమ్‌లు భారత్‌కు అండగా నిలిచాయి. మెజార్టీ సభ్యులు భారత్‌కు మద్దతుగా మాట్లాడారు. ప్రపంచంలోనే భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశమని ఈయూ కొనియాడింది. భారత్, జమ్మూ కశ్మీర్‌లలో జరుగుతున్న ఉగ్రదాడులను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఉగ్రవాదులు ఆకాశం నుంచి ఊడిపడడం లేదని, పొరుగుదేశం నుంచే వస్తున్నారంటూ పరోక్షంగా పాకిస్థాన్‌పై మండిపడింది. పాక్ స్థావరంగానే టెర్రరిస్టులు యూరప్‌లో దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also watch :

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ఉగ్రవాదులు రైల్వే స్టేషన్లను టార్గెట్ చేశారని ఐబీ వార్నింగ్

Thu Sep 19 , 2019
ఉగ్రవాదులు రైల్వే స్టేషన్లను టార్గెట్ చేశారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. రైల్వే స్టేషన్లపై దాడులకు టెర్రరిస్టులు ప్రణాళిక రచించారని వార్నింగ్ ఇచ్చాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, రైళ్లలో భద్రతను పెంచారు. కీలకమైన రైల్వే స్టేషన్లలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తనిఖీలు చేపట్టింది. స్థానిక పోలీసులు, RPF సిబ్బంది సంయుక్తంగా సోదాలు చేపట్టారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రైల్వే స్టేషన్ల ముందు […]