ఉల్లి ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం :చంద్రబాబు

Read Time:0 Second

chandrababunaidu

ఏపీలో ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. కేజీ ఉల్లి ధర 200లకు చేరువ అవుతుండడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతు బజార్లకు కిలోమీటర్ల మేర బారులు తీసుకున్నారు. ఏపీలో ఉల్లి కష్టాలపై.. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు గళం విప్పతున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఆందోళన చేపట్టారు. ఉల్లి ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం అయిందంటూ… సచివాలయం ఫైర్‌ స్టేషన్‌ వద్ద నిరసన తెలిపారు. అక్కడనుంచి కాలినడకన అసెంబ్లీకి వెళ్తున్నారు. వెంటనే ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకుని.. ఉల్లి ధరలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు చంద్రబాబు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close