ఆ పనులను ఆపేసిన జగన్‌.. కేసీఆర్‌ చెప్పిన దానికి ఎందుకు తలూపుతున్నారు : దేవినేని ఉమ

సీఎంల సమావేశంలో గత ప్రభుత్వం హాయంలో జరిగిన కృష్ణా- గోదావరి అనుసంధానంపై ఎందుకు చర్చించలేదని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. గత నాలుగేళ్లలో పట్టిసీమ ద్వారా 263 టిఎంసీల నీటిని మళ్లించిన ఘనత టీడీపీకి దక్కుతుందన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాజెక్టుల పనుల ఆపేసిన జగన్‌.. కేసీఆర్‌ చెప్పిన దానికి ఎందుకు తలూపుతున్నారన్నారు. ఏపీలో ఉన్నప్పుడు కోడిగుడ్డుపై ఈకలు పీకే జగన్‌.. బార్డర్‌ దాటి తెలంగాణలో అడుగుపెడితే రివర్స్‌ టెండరింగ్‌, జ్యుడిషియల్‌ కమిటీలు కనిపించడం లేదన్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

కన్నతండ్రే కూతురు పాలిట..

Sat Jun 29 , 2019
కులం తక్కువ అతన్ని పెళ్లి చేసుకుందని కన్న తండ్రే కూతురు పాలిట యముడయ్యాడు. కులం పిచ్చిలో ఆమె పుట్టింటి వారిని మానవత్వం కూడా మరిచిపోయేలా చేసింది. బాలింత అని చూడకుండా చిత్రహింసలు పెట్టి పొట్టనపెట్టుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఏడు రోజుల పసికందు మొహం చూసైనా కూతుర్ని వదిలిపెట్టలేదు ఆ తండ్రి. కులం మత్తులో మనిషి అనే విషయాన్నే మరిచిపోయింది బాస్కర నాయుడి కుటుంబం. […]