అలా చేస్తే రాష్ట్రంలో ఉన్న జైళ్లు సరిపోవు : నారా లోకేష్

ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పరిపాలనపై నియంత్రణ కోల్పోయిన జగన్ ..నియంతలా మారారని ఆరోపించారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ..ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పాత్రికేయులను
మట్టుపెడుతున్నారంటూ మండిపడ్డారు.. మరి మీ తుగ్లక్‌ పాలన గురించి మాట్లాడుకుంటున్న ప్రజలపైనా కేసులు పెడతారా అంటూ నిలదీశారు. పిచ్చిముదిరి ఇలా కేసులు పెడుతూ పోతే రాష్ట్రంలో ఉన్న జైళ్లు కూడా సరిపోవన్నారు లోకేష్. నిజాయితీ ఉంటే కేసులు పెట్టడం మానేసి.. ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.

TV5 News

Next Post

విడాకులు తీసుకున్న మంచు మనోజ్

Thu Oct 17 , 2019
టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి చెప్పారు. తన భార్య ప్రణతితో విడాకులు తీసుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాడు. అందులో భార్యభర్తలుగా తమ ప్రయాణానికి ముగింపు పలికాం.. విడిపోయినప్పటికీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది. అలాగే ఈ సమయంలో ప్రణతి కుటుంబం ఎంతో అండగా నిలిచిందని పేర్కొన్నారు. తనకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ […]