అనుమానంతో 8 నెలల కొడుకును చంపి.. ఆపై భార్యపై దాడి..

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో 8 నెలల కన్నకొడుకును నేలకేసి కొట్టి చంపాడు చిన్నపుల్లయ్య అనే ఓ వ్యక్తి. అంతేకాదు.. భార్యను సైతం కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత రోకలి బండతో కొట్టి తీవ్రంగా గాయపర్చాడు. ఈ ఘటన రాచర్ల మండలంలో జరిగింది. తీవ్రంగా గాయపడిన మహిళను గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు స్థానికులు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

చిన్నపుల్లయ్య… తన భార్యను గత కొంతకాలంగా అనుమానిస్తున్నాడు. ఆ అనుమానం పెనుభూతంగా మారింది. ఆమెపై తీవ్రంగా ఆగ్రహంతో ఊగిపోయిన చిన్నపుల్లయ్య….. ముందుగా కన్నకొడుకును నేలకేసి కొట్టి చంపాడు. ఆ తర్వాతా భార్యపై సైతం దాడి చేశాడు. చిన్న పుల్లయ్యకు ఈమె రెండో భార్య.

గతంలోనే చిన్నపుల్లయ్య… లక్ష్మీదేవి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమెపైనా అనుమానంతో హత్య చేశాడు. ఈ కేసులో 8 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఇప్పుడు రెండో భార్యపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.

TV5 News

Next Post

నవంబర్‌ 9.. తేదీకి అనేక ప్రత్యేకతలు

Sun Nov 10 , 2019
నవంబర్‌ 9.. ! ఈ తేదీకి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు అంతిమ తీర్పు ఇచ్చింది. ఈ చారిత్రక తీర్పుతో 130 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు ఇదే రోజున పరిష్కారం దొరికింది. ఎన్నో వివాదాలు, మరెన్నో కేసులు, ఇంకెన్నో వాదనలు, అడ్డంకులు, మధ్యవ ర్తిత్వాలు దాటుకొని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు ప్రకటించింది. అయోధ్యలోని వివాదాస్పద […]