ఎంపీపీ ఎన్నికలో కిష్కింధకాండ.. మహిళ చీరపట్టుకుని లాగుతూ ..

సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి ఎంపీపీ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సమావేశ మందిరం కిష్కింధకాండను తలపించింది. ఓ మహిళా ఎంపీటీసీతో కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యులు ఆటాడుకున్నారు. తమవైపునకు రావాలంటే తమవైపునకు రావాలంటూ ఆమె చీరపట్టుకుని చెరోవైపు లాగారు.

మొగుడంపల్లి మండల పరిషత్‌లో మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. చెరో ఐదు స్థానాలు కాంగ్రెస్, టీఆర్ఎస్ గెలుపొందాయి. ఒకచోట స్వతంత్ర్య అభ్యర్థి గెలిచారు. ఆ ఎంపీటీసీని ఎలాగైనా తమ శిబిరంవైపు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ప్రయత్నాలు చేశారు. చివరికి కాంగ్రెస్ వ్యూహం ఫలించింది. మన్నాపూర్ ఎంపిటిసి ప్రియాంకను తమ వైపు తిప్పుకోగలిగారు. ఆమెకు మండలాధ్యక్ష పదవి ఇస్తామని ప్రతిపాదించారు. ప్రియాంక కాంగ్రెస్ సభ్యులతో పాటు కలిసి సమావేశానికి రావడంతో.. TRS వాళ్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆమెను సమావేశమందిరంలోకి రాకుండా అడ్డుకున్నారు. తర్వాత తమవైపు తిప్పుకునేందుకు ఆమెను పట్టుకొని లాగే ప్రయత్నం చేశారు. అటు కాంగ్రెస్.. ఇటు టీఆర్ఎస్ సభ్యులు చెరోవైపు ఆమెను లాగుతూ వాగ్వాదానికి దిగారు. చివరికి.. పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఫైనల్‌గా కాంగ్రెస్ పార్టీ సభ్యుల సహకారంతో ప్రియాంక ఎంపీపీగా ఎన్నికైంది.

సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి ఎంపీపీ ఎన్నిక కిష్కింధకాండను తలపించింది. ఓ మహిళా ఎంపీటీసీతో కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యులు ఆటాడుకున్నారు. తమవైపునకు రావాలంటే తమవైపునకు రావాలంటూ చీరపట్టుకుని చెరోవైపు లాగారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

జవాన్ ఆవేదన.. తన భూమిని మరోవ్యక్తి పేరుపై పట్టా చేసిన రెవెన్యూ అధికారులు

Sun Jun 16 , 2019
ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ రక్షణ కోసం పాటుపడేది జవాన్‌. సరిహద్దుల్లో ప్రత్యర్థి తూటకు ధైర్యంగా ఎదురెళ్లే ధీరత్వం జవాన్‌ది. పగలనక రాత్రనక దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో కాపలా కాస్తున్న ఆ జవాన్‌కు నేడు భరోసా లేకుండా పోయింది. జవాన్‌ భూమికి భద్రత లేకుండా పోయింది. సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్న తనవారి ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందంటూ ఓ యువ సైనికుడు ఆవేదన […]