ఎయిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని మొదటి అంతస్థులో అకస్మాత్తుగా అంటుకున్నాయి. ఎమర్జెన్సీ వార్డు సమీపంలో చెలరేగిన అగ్నిజ్వాలలు, అక్కడి నుంచి హాస్పిటల్‌ లోని ఇతర విభాగాలకు వ్యాపించాయి. ఐదో అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక బృందాలు, వెంటనే ఎయిమ్స్‌కు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. 39 ఫైరింజిన్ల సాయంతో మంటల్ని అదుపు చేశారు.

ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోగులు, వారి బంధువులు ఆందోళనకు గురయ్యారు. వెంటిలేటర్‌పై ఉన్న ఏడుగురితో సహా 32 మందిని రోగుల్ని మరోచోటికి తరలించారు. బీజేపీ సీనియర్‌ నేత అరుణ్ జైట్లీ, ఎయిమ్స్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఐతే, ఆయనకు హాస్పిటల్‌లోని వేరే బిల్డింగులో ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఎయిమ్స్‌ చరిత్రలోనే ఇది అతి పెద్ద అగ్ని ప్రమాదంగా చెబుతున్నారు ఇక్కడి వైద్యులు. ఎమర్జెన్సీ వార్డుదగ్గర సంభవించిన షార్ట్‌ సర్య్కూటే ఈ ప్రమాదానికి కారణమని తేల్చారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే మైక్రోబయాలజీ విభాగంలోని వైరాలజీ యూనిట్‌ పూర్తిగా కాలిపోయింది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

కృష్ణాకు వరదలు వస్తే జగన్‌ అమెరికా పర్యటనకు వెళ్లారు : చంద్రబాబు

Sun Aug 18 , 2019
కృష్ణా, గుంటూరు జిల్లాలో వరద బాధితులకు టీడీపీ అండగా నిలిచింది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు టిడిపి నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితులకు అండగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సహాయక చర్యల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌ఛార్జులు, ఇతర నేతలు పాల్గొనాలన్నారు. పసుపు, కంద, నిమ్మ, అరటి, కూరగాయల తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బాధితులకు నిత్యావసర […]