ఆవిడ మీద కోపం.. అందుకే ఉంగరం..

Read Time:0 Second

ఆవిడ మీద నాకు పీకలదాకా కోపం వుంది. అసలామెతో పదేళ్లు ఎలా కాపురం చేసానో అర్థం కావట్లేదు. అమె అనవాళ్లు ఏమైనా కనిపిస్తే చాలు విసిరి అవత పారేస్తా.. అంటూ ఆమె ఉంగరాన్ని ఓ చేప తోకకి పెట్టాడు. ఈ వింత స్టోరీ అమెరికాలో జరిగింది. జేసన్ రోజ్ అనే వ్యక్తికి చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం. కానీ అది ఆయన భార్యకు ఇష్టం లేదు. రోజూ దీని గురించి ఇంట్లో గొడవ. సర్లే ఆమెకు ఇష్టం లేదు కదా అని ఆయనా వదల్లేదు. ఆమె కూడా వదల్లేదు. పని మానేసి మరీ చేపలు పట్టడానికి వెళుతుంటే ఆవిడకు చిర్రెత్తుకొచ్చేది. నావల్ల కాదు ఈయన్ని భరించడం అంటూ విడాకులకు అప్లై చేసింది. భర్త కూడా ఆమెనుంచి విడిపోవడానికి సిద్ధమయ్యాడు. దీంతో విడాకులు మంజూరవడంతో ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. అయితే నిశ్చితార్థం సమయంలో భార్యకు తొడిగిన ఉంగరం ఒకటి ఆమె నుంచి దూరమయ్యాక ఇంట్లో కనిపించింది. వెంటనే దాన్ని తీసుకువెళ్లి ఓ చేప తోకకు గుచ్చాడు జేసన్. ఆ చేపను తీసుకు వెళ్ల మిచిగన్ సరస్సులో వదిలేశాడు. నెల రోజుల తరువాత సరస్సులో చేపల వేటకు వెళ్లిన నలుగురు స్నేహితుల వలలో ఉంగరం ఉన్న చేప పడింది. దాని తోక దగ్గర ఏదో మెరుస్తూ కనిపించేసరికి ఆశ్చర్యంతో చూశారు. ఉంగరం పైన జేసన్ రోజ్ అన్న పేరు రాసి ఉండేసరికి స్థానిక మీడియాకు సమాచారం అందించారు. మీడియా జేసన్‌ను కలిసి విషయం ఏంటనే సరికి తన స్టోరీ అంతా చెప్పుకొచ్చాడు. భార్యతో పాటు ఉంగరాన్ని వదిలించుకున్నాక జీవితం ఎంతో ప్రశాంతంగా ఉందని చెప్పుకొచ్చాడు జేసన్.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published.

Close