ఏపీలో ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ

ఎగువ నుంచి పోటెత్తిన వరదలకు కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుంది. నది పాయలు కూడా పొంగిపొర్లుతుండడంతో ఆయా ప్రాంతాల్లోని కుంటలు, కాలువలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. నీటి ప్రవాహనికి కొన్నిచోట్ల కుంటలు, చెరువుల కట్టలకు గండి పడుతున్నాయి. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం పోతార్లంకలో కృష్ణ కరకట్టకు కొద్దిపాటి గండిపడింది. వరదనీటితో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరకట్టకు గండిపడడంతో అటు అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. నివారణ చర్యలు చేపట్టారు.

కర్నూలు జిల్లా పాములపాడు మండలం జూటూరు సమీపంలోని ఎఆర్‌ఎస్‌సీ కాల్వకు గండిపడింది. దీంతో శ్రీశైలం బ్యాక్‌ వాటర్ తెలుగుగంగలోకి భారీగా ప్రవహిస్తుంది. వరద నీటితో చుట్టు ప్రక్కల గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదంతో ప్రజలు భయపడిపోతున్నారు. ముందస్తు చర్యలుగా ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

గోల్కొండలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్

Thu Aug 15 , 2019
పంద్రాగస్టు వేడుకలకు తెలంగాణలో గొల్కొండ కోట ముస్తాబైంది. ఇవాళ సీఎం కేసీఆర్‌ గోల్కొండలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ముందుగా పరేడ్ గ్రౌండ్స్ కు సైనిక అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. అక్కడ్నుంచి గొల్కొండ చేరుకొని పదిగంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించడానికి వీలుగా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లుచేశాయి. పెద్ద సంఖ్యలో వీఐపీలు, ప్రజలు హాజరయ్యే అవకాశాలు […]