అంబరాన్నంటిన ‘కనకాంబరం’.. కిలో రూ.1000

శ్రావణ మాసం.. లక్ష్మీ దేవికి ఆవాసం. వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని పూలకు రెక్కలొచ్చాయి. ధరలు నింగినంటుతున్నాయి. కిలో కనకాంబరాలు వెయ్యి రూపాయలు పలుకుతున్నాయి మార్కెట్లో. శ్రావణమాసం మొదలైనప్పటినుంచి కనకాంబరం సాగుదారులకు కనకం కురిపిస్తోంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం బత్తలపల్లి మార్కెట్లో కిలో కనకాంబరం పూల ధర రూ.950 నుంచి 1050 వరకు పలికింది. రెండ్రోజుల క్రితం రూ.1300 పలకడంతో రైతులకు అదనపు ఆదాయం వచ్చింది. జూన్ నెలలో ఆషాఢ మాసం కావడంతో ధరలు లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. శ్రావణ మాసం రాగానే రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ఆ అంశాలనే జగన్‌ ప్రభుత్వం అడగటం విడ్డూరం : ఎంపీ జీవీఎల్‌

Thu Aug 8 , 2019
ఓట్ల కోసమే గత ప్రభుత్వాలు కశ్మీరీలను వాడుకున్నాయని బీజేపీ ఎంపీ జీవిఎల్‌ నరసింహారావు అన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి ఆర్టికల్‌ 370 రద్దుకు చాలా పార్టీలు సహకారం అందించాయన్నారు. లిఖిత పూర్వకంగా రామయ్యపట్నంలో పోర్టు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరితే పోర్టు పనులు ప్రారంభమవుతాయన్నారు జీవీఎల్‌. ఏపీలో కొత్త ప్రభుత్వ నిర్ణయాలు, గతంలో చంద్రబాబు తీసుకున్నట్టుగానే ఉన్నాయన్నారు. గతంలో సాధ్యంకావని చెప్పిన అంశాలనే జగన్‌ ప్రభుత్వం మళ్లీ అడగటం విడ్డూరమన్నారు […]