ఎన్నికల సంస్కరణల ఆద్యుడు టి.ఎన్.శేషన్ ఇకలేరు

tn-sheshan

దేశంలో ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలకు ఆజ్యం పోసిన మాజీ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ టీఎన్‌ శేషన్‌ ఇకలేరు. శేషన్‌ మరణించిన విషయాన్ని మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషీ వెల్లడించారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. వృద్ధాప్య సమస్యలతో కొన్నేళ్లుగా చెన్నైలోని తన స్వగృహంలో ఉంటున్న ఆయన.. ఆదివారం రాత్రి 9.30 గంటలకు తుది శ్వాస విడిచారు. కేరళలోని పాలక్కాడ్‌ జిల్లా తిరునెళ్లాయిలో 1932 డిసెంబరులో జన్మించిన టీఎన్‌ శేషన్‌ ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశారు. హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేశారు.

TV5 News

Next Post

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన టీఎన్‌ శేషన్‌

Mon Nov 11 , 2019
మాజీ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ టీఎన్‌ శేషన్ ఆదివారం రాత్రి 9.30 గంటలకు తుది శ్వాస విడిచారు. తమిళనాడు కేడర్‌ నుంచి 1955 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన శేషన్‌.. దేశానికి 18వ కేబినెట్‌ సెక్రటరీగా పని చేశారు. అనంతరం ఎన్నికల కమిషన్‌కు పదో సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. 1990 నుంచి 1996 వరకూ ఆరేళ్లపాటు ఆయన సీఈసీగా వ్యవహరించారు. 1997లో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి కేఆర్‌ నారాయణన్‌ […]