కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్ట్

కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను ఎట్టకేలకు సీబీఐ, ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనను సీబీఐ హెడ్క్వార్టర్స్ కు తరలించారు. అంతకుముందు.. AICC కార్యాలయంలో చిదంబరం ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో సీబీఐ, ఈడీ అధికారులు, AICC ఆఫీసుకు వచ్చారు. వారిని లోపలికి రాకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ గొడవ జరుగుతుండగానే చిదంబరం వెళ్లిపోయారు. సీబీఐ, ఈడీ అధికారులు AICC ఆఫీసు వద్ద వేచి ఉండగా, చిదంబరం చల్లగా తన ఇంటికి చేరుకున్నారు. దాంతో దర్యాప్తు బృందాలు చిదంబరం ఇంటికి వచ్చాయి. తొలుత అక్కడ ఎవరూ గేటు తీయకపోవడంతో.. కొందరు అధికారులు గేటు దూకి లోపలకు వెళ్లారు. మరికొందరు తీవ్రంగా ప్రయత్నించడంతో ఎట్టకేలకు గేటు తెరిచారు. దీంతో చిదంబరంను అదుపులోకి తీసుకున్నారు.’

 

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

కూతురిపై 15 సంవత్సరాలుగా తండ్రి లైంగిక దాడి

Thu Aug 22 , 2019
సభ్య సమాజం తలదించుకునే ఘటన. కూతురిని కంటికి రెప్పలా కాపాడల్సిన తండ్రే పైశాచికంగా ప్రవర్తించాడు. కామంతో కూతురిపై కన్నెశాడు ఓ కసాయి. 15 సంవత్సరాలపాటు లైంగిక దాడి చేస్తూ.. పైశాచిక ఆనందం పొందుతున్నాడు. దీనికితోడు బాధితురాలి తల్లి కూడా భర్తకే మద్దతు తెలపడంతో.. సమాజంలో నైతిక విలువలు ఎంతలా దిగాజారుతున్నాయో తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. లక్నోకు చెందిన 21వ సంవత్సారాల […]