అమెరికాలో అనుమానాస్పద స్థితిలో నలుగురు తెలుగు వాళ్లు మృతి

అమెరికాలో దారుణం జరిగింది. అనుమానాస్పద స్థితిలో నలుగురు తెలుగు వాళ్లు మృతిచెందారు. అయోవా రాష్ట్రంలోని వెస్ట్ డెస్ మోయిన్స్‌‌లోని ఓ ఇంట్లో గెస్ట్‌లుగా ఉంటున్న నలుగురి మృతదేహాలు అనుమానాస్పద రీతిలో పడి ఉన్నాయి. మృతులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుంకర చంద్రశేఖర్‌, లావణ్య, వారి ఇద్దరు పిల్లలుగా గుర్తించారు.

అదే ఇంట్లో గెస్ట్‌గా ఉంటున్న మరో యువకుడు భయంతో బయటకు వచ్చి స్థానికులకు సమాచారం ఇచ్చాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకొని.. పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు. మృతులు సుంకర చంద్రశేఖర్, సుంకర లావణ్య.. మరో ఇద్దరు బాలురుగా గుర్తించారు. పరిసరాలను బట్టి చూస్తే కాల్పుల్లో చనిపోయినట్టు కనిపిస్తోందని తెలిపారు. . నలుగురి ఒంటిపై బుల్లెట్ గాయాలు ఉన్నట్లు వెల్లడించారు..

చంద్రశేఖర్ మానసిక ఒత్తిడి వల్ల తన కుటుంబాన్ని చంపి.. తాను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. . కొంతకాలంగా చంద్రశేఖర్ మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బంధువుల వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

అసెంబ్లీలో ఆ అంశంపై అభ్యంతరాలు తెలపాలని టీడీపీ నిర్ణయం

Mon Jun 17 , 2019
రెండు రోజుల విరామం తరువాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. సభలో ముఖ్యంగా గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. ఇప్పటికే గవర్నర్‌ ప్రంసంగంపై ప్రతిపక్ష టీడీపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వైసీపీ కరపత్రంలా ఆయన ప్రసంగం సాగిందని.. ఏపీ రాజధాని అమరావతి గురించి ప్రస్థావనం లేకపోవడం ఏంటని ప్రశ్నించింది. ఇదే అంశంపై ఇవాళ సభలో అభ్యంతరాలు తెలపాలని టీడీపీ నిర్ణయించింది. మరోవైపు […]