వినాయకుడి నిమజ్జనోత్సవంలో అందాలతార తీన్ మార్ డాన్స్

గణపతి బప్పా మోరియా.. మంగళమూర్తి మోరియా… అంటూ విఘ్నేశ్వరుడికి ఘనంగా వీడ్కోలు పలికారు బాలీవుడ్ తారలు. గణనాధునికి ప్రత్యేక పూజలు చేసి నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తన భర్త, చెల్లెలు షమితా శెట్టితో కలిసి వినాయకుడి నిమజ్జనోత్సవంలో శిల్పా శెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిల్పా తీన్ మార్ డాన్స్ చేశారు. కోలాటల మధ్య భక్తులతో కలిసి డాన్స్‌ చేస్తూ అలరించారు. ప్రతి ఏటా అభిమానుల మధ్య వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటామని చెప్పారు.

అటు కండలవీరుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ తమ ఇంట్లో గణపతి విగ్రహాన్ని నెలకొల్పి ఉత్సవాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ఖాన్ కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. తన మేనల్లుడిని ఎత్తుకుని గణనాధునికి సల్మాన్ ఖాన్‌ ప్రత్యేక పూజలు చేశారు. నిమజ్జన కార్యక్రమంలో వారంతా ఉత్సాహంగా నృత్యాలు చేశారు. గణపతి నిమజ్జన వేడుకల్లో సల్మాన్ తీన్మార్ డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

పెళ్లి నుంచి తప్పించుకునేందుకు యువకుడు చేసిన పని..

Wed Sep 4 , 2019
శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రవీణ్‌ అనే యువకుడి కిడ్నాప్‌ డ్రామా కలకలం సృష్టించింది. లండన్‌ నుంచి వచ్చిన తనను క్యాబ్‌డ్రైవర్‌ కిడ్నాప్‌ చేశాడంటూ.. తండ్రికి ఫోన్‌ చేశాడు ప్రవీణ్‌. తన దగ్గరున్న రెండు లక్షల కరెన్సీతో పాటు బంగారం ఎత్తుకెళ్లినట్లు తండ్రికి ఫోన్లో చెప్పాడు. తాను గుర్తుతెలియని ప్రదేశంలో ఉన్నానని, తనను రక్షించాలని వేడుకున్నాడు. కుమారుడి ఫోన్‌తో కంగారు పడిన తండ్రి శేషగిరిరావు.. హుటాహుటిన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్‌ స్టేషన్ […]